'సై రా'కి కొత్త సమస్య.. చిరు ఎలా హ్యాండిల్ చేస్తాడో..?

Published : Sep 15, 2018, 12:56 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
'సై రా'కి కొత్త సమస్య.. చిరు ఎలా హ్యాండిల్ చేస్తాడో..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కర్నాటకలో విడుదల కాదేమోనని మేకర్స్ ఆందోళన చెందుతుంటే ఇప్పుడు సై రాకి మరో సమస్య వచ్చి పడింది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కర్నాటకలో విడుదల కాదేమోనని మేకర్స్ ఆందోళన చెందుతుంటే ఇప్పుడు సై రాకి మరో సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం చిరు అండ్ టీమ్ జార్జియాకి వెళ్లారు.

ఈ ఒక్క షెడ్యూల్ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరగనుంది. అయితే జార్జియా నుండి తిరిగి వచ్చిన తరువాత చిరు 'సై రా' పనులపై కాకుండా రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

నవంబర్ నెలాఖరున జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీలో చిరంజీవికి కీలక స్థానం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారట. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఓటర్లను ప్రభావితం చేయాలి అంటే చిరంజీవి అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సూచనతో ఏకీభవించిన రాహుల్.. చిరంజీవిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో చిరు బిజీ అయితే గనుక 'సై రా' షెడ్యూల్ లో భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు