'గీత గోవిందం' డైరెక్టర్ పై మంచు ఫ్యామిలీ ప్రెషర్!

Published : Aug 17, 2018, 02:18 PM ISTUpdated : Sep 09, 2018, 11:37 AM IST
'గీత గోవిందం' డైరెక్టర్ పై మంచు ఫ్యామిలీ ప్రెషర్!

సారాంశం

'గీత గోవిందం' సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో అతడి క్రేజ్ పెరిగింది

'గీత గోవిందం' సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో అతడి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా అతడితో సినిమా చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు. పరశురామ్ ప్లాన్ కూడా అదే.. స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇంతలోనే ఓ సమస్యలో ఇరుక్కున్నాడు.

'శ్రీరస్తు శుభమస్తు' సినిమా తరువాత పరశురామ్ తో మంచు ఫ్యామిలీ ఓ సినిమా చేయాలనుకుంది. దీనికోసం అతడికి పాతిక లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. మంచు విష్ణు హీరోగా సినిమా చేయాల్సివుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదు. పరశురామ్ కూడా అడ్వాన్స్ తిరిగివ్వలేదు. ఇప్పుడు 'గీత గోవిందం' సినిమా కావడంతో మంచు ఫ్యామిలీ పరసురామ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విష్ణుతో కలిసి పని చేయడం పరశురామ్ కి ఎంతమాత్రం ఇష్టం లేదట. కానీ అడ్వాన్స్ తీసుకున్నాక తప్పదు. ఈ ప్రాజెక్ట్ నుండి బయటకి రావాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ పరశురామ్ తో ఎలాగైనా సినిమాలు చేయాలని మంచు ఫ్యామిలీ పావులు కదుపుతోందట. మరి పరశురామ్ ఎవరితో సినిమా చూస్తారో చూడాలి! 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌