బిగ్ బాస్2: ఈ వారం ఎలిమినేషన్ పై పబ్లిక్ టాక్!

By Udayavani DhuliFirst Published Aug 17, 2018, 1:37 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఆరంభంలో కాస్త నిరాశ పరిచినప్పటికీ ఇప్పుడు మాత్రం పుంజుకుంది. ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో షోని రసవత్తరంగా నడిపిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 2 ఆరంభంలో కాస్త నిరాశ పరిచినప్పటికీ ఇప్పుడు మాత్రం పుంజుకుంది. ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో షోని రసవత్తరంగా నడిపిస్తున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆడియన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతివరం హౌస్ నుండి ఒక్కొక్కరు చొప్పున ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ మరింత ఆసక్తికరంగా సాగాయి.

హౌస్ నుండి ఈ వారం ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే విషయాలు ఇప్పటివరకు ముందే లీక్ అయిపోయాయి. కానీ ఈసారి ఏకంగా ప్రజలే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని చెప్పేస్తున్నారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు నిర్వహించిన పబ్లిక్ పోల్ లో ముక్తకంఠంతో అందరూ ఒక్కరి పేరు చెబుతున్నారు. అది ఎవరంటే దీప్తి సునైనా. నిజానికి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే హౌస్ లో దీప్తి చాలా వీక్ అనే చెప్పాలి.

టాస్క్ లలో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయదు. తనీష్, సామ్రాట్ ల సపోర్ట్ తో ఇప్పటివరకు ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది. ఇక రీసెంట్ గా అమ్మడు చేసిన హడావిడికి కౌశల్ ఆర్మీ ఆమెను టార్గెట్ చేసింది. కాల్ సెంటర్ టాస్క్ లో దీప్తి.. కౌశల్ తో మాట్లాడిన తీరు ఏ ఒక్కరికీ నచ్చలేదు. ఈ వారం ఆమెకు ఓట్లు కూడా తక్కువ పడ్డాయని సమాచారం. సో.. ఈ వీక్ సునైనా బయటకి వెళ్లక తప్పదన్నమాట! 

click me!