'గీత గోవిందం'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

By Udayavani DhuliFirst Published Aug 17, 2018, 1:56 PM IST
Highlights

గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన 'గీత గోవిందం' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటనే చెప్పాలి

గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన 'గీత గోవిందం' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటనే చెప్పాలి. ఇప్పుడు ఈ టీమ్ అందరినీ పార్టీ మోడ్ లోకి తీసుకొని వెళ్లబోతున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ సినిమాపై రూ.13 కోట్లు పెట్టుబడి పెడితే మొదటి రోజే రూ.10 కోట్లు వసూలు చేసింది.

శాటిలైట్, డిజిటల్ రైట్స్ మొత్తం కలుపుకొని తొలిరోజే ఈ సినిమా పెట్టుబడిని రాబట్టింది. ఇక ఈ వారాంతంలో సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయం. గీతాఆర్ట్స్ కు ఈ సినిమా భారీ లాభాలు తీసుకొని రావడంతో అల్లు అర్జున్ టీమ్ అందరికీ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. దీనికోసం హైదరాబాద్ నగర శివార్లలో అతడి ఫామ్ హౌస్ వేదిక కానుంది. దీనికి లైట్ మేన్ నుండి టీమ్ లో ప్రతి ఒక్కరూ హాజరు కానున్నారు.

గతంలో బన్నీ ఇదే మాదిరి 'మహానటి' సినిమా కోసం పార్టీ ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా కోసం పార్టీ ఎరేంజ్ చేస్తున్నాడు. ఈ శనివారం నాడు బన్నీ, గీత గోవిందం టీమ్ తో గడపనున్నారు. ఆదివారం నాడు సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించాలని అనుకున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. 

click me!