'RRR' సర్పైజ్: మూడు గెటప్స్ తో రామ్ చరణ్ రచ్చ

By Udaya DFirst Published Feb 14, 2019, 10:41 AM IST
Highlights

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఊరిస్తోంది. 

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఊరిస్తోంది.  రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వీళ్ళిద్దరి గెటప్ లు ఎలా ఉండబోతున్నాయి..రాజమౌళి వారిని ఎలా చూపెట్టబోతున్నరనే విషయమై అభిమానుల్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.  

‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ఈ సినిమాలో   మూడు గెటప్స్ లో కనిపిస్తారు. ఒకటి బ్రిటీష్ అధికారిగా... మరొకటి నలభైల కాలంనాటి ఓ ప్రత్యేకమైన  మాస్ లుక్ లో  కనిపిస్తారట. అలాగే క్లైమాక్స్ కు వచ్చే సరికి పూర్తి లుక్ మారిపోతుందట.

అప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడుగా పూర్తి హిందు స్దానీ లుక్ తో ఉంటారట. అలాగే లుక్ లో మరీ వైవిధ్యం చూపలేకపోయినా చరణ్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు. మార్చి 27 న  రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. అప్పుడు సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని  చిత్ర యూనిట్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఆ ఫస్ట్ లుక్ విడుదల కోసం ఇప్పటినుంచే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.

 

click me!