'దేవ్' ట్విట్టర్ రివ్యూ..!

Published : Feb 14, 2019, 10:34 AM IST
'దేవ్' ట్విట్టర్ రివ్యూ..!

సారాంశం

తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. 

తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

తమిళంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు మొదలుకావడంతో సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. ఈ సినిమాలో రకుల్ బోల్డ్ క్యారెక్టర్ లో బాగా నటించిందని ప్రశంసిస్తున్నారు. 

ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Kamal Haasan: 40 ఏళ్లుగా స్నేహం, కానీ మెగాస్టార్ విషయంలో కమల్ హాసన్ బాధ ఇదొక్కటే
Gunasekhar: ప్లాప్ ఇస్తే ఫోన్ కూడా ఎత్తరు.. వరుడు తర్వాత బన్నీ.. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్