జూ. ఎన్టీఆర్ ఒంటరిగా.. రాంచరణ్ అప్పటి వరకు దూరంగానే!

By Siva KodatiFirst Published 27, May 2019, 5:19 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్, రాంచరణ్ షూటింగ్ లో గాయపడడంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. దాదాపు నెలరోజుల గ్యాప్ తర్వాత రాజమౌళి షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్, రాంచరణ్ షూటింగ్ లో గాయపడడంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. దాదాపు నెలరోజుల గ్యాప్ తర్వాత రాజమౌళి షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొన్నాడు. 

కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన స్టంట్స్ ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై చిత్రీకరించనున్నారు. రాంచరణ్ మాత్రం ఇంకా బ్రేక్ లోనే ఉన్నాడు. త్వరలో అహ్మదాబాద్ లో కీలకమైన షెడ్యూల్ పార్రంభం కాబోతోంది. ఆ షెడ్యూల్ లో రాంచరణ్ జాయిన్ అవుతాడు. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రాంచరణ్ జోడిగా అలియా భట్ నటిస్తోంది. తదుపరి షెడ్యూల్ లో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. దీనికోసం కొందరు బ్రిటిష్ నటీమణులని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Last Updated 27, May 2019, 5:19 PM IST