ఎన్టీఆర్ ఐటెం సాంగ్ బ్యూటీ.. ఎంపీ అయింది!

Published : May 27, 2019, 04:55 PM IST
ఎన్టీఆర్ ఐటెం సాంగ్ బ్యూటీ.. ఎంపీ అయింది!

సారాంశం

సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన చాలా మంది తారలు తమ సత్తా చాటారు. అలానే ఎదురుదెబ్బలు తిన్నవారు కుడా ఉన్నారు. 

సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన చాలా మంది తారలు తమ సత్తా చాటారు. అలానే ఎదురుదెబ్బలు తిన్నవారు కుడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చాలా మంది సెలబ్రిటీలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

అయితే ఒక చిన్న హీరోయిన్ ఏకంగా ఎంపీగా గెలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో 'శీను వాసంతి లక్ష్మి', 'జగపతి' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నవనీత్ కౌర్.. ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ'లో అతడి సరసన ఓ పాటలో నర్తించి సందడి చేసింది. ఆ తరువాత ఇతర భాషల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు.

కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకి చెందిన రవి రాణా అనే ఎమ్మెల్యేని పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. తన భర్త బాటలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె గత పార్లమెంట్ ఎలెక్షన్స్ లో పోటీ చేసిన తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె శివసేన అభ్యర్ధి చేతిలో ఓడిపోయింది. అప్పటికి నవనీత్ కి జనాల్లో పెద్దగా గుర్తింపు కూడా లేదు.

కానీ కొన్నేళ్లలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ బాగా పేరు సంపాదించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ పార్టీ బలంగా కనిపించినప్పటికీ బీజీపీ పొత్తుతో బరిలోకి దిగిన శివసేన అభ్యర్ధిని ఓడించి ఎంపీగా గెలిచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. 29 స్థానాలున్న మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నుండి గెలిచినఏకైక అభ్యర్ధి నవనీత్ మాత్రమే.. 

PREV
click me!

Recommended Stories

Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ
చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ