రేస్ మొదలైంది.. కేక పెట్టిస్తున్న ప్రభాస్ యాక్షన్ లుక్!

By Siva KodatiFirst Published May 27, 2019, 4:48 PM IST
Highlights

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ పెర్ఫామెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆరడుగుల భారీ కటౌట్ తో ప్రభాస్ విలన్లకు సింహ స్వప్నంలా కనిపిస్తాడు. 

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ పెర్ఫామెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆరడుగుల భారీ కటౌట్ తో ప్రభాస్ విలన్లకు సింహ స్వప్నంలా కనిపిస్తాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఇండియా మొత్తం అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా సాహో చిత్రంతో త్వరలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. 

హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రంలో తెరకెక్కించే యాక్షన్ సన్నివేశాలు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో సాహో చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల ప్రభాస్ స్పై లుక్ లో ఉన్న పోస్టర్ ని విడుదల చేసింది. దీనితో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్ర  యూనిట్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేకపెట్టించే ప్రభాస్ యాక్షన్ లుక్ ని యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది. 

బైక్ పై మెరుపువేగంతో ప్రభాస్ దూసుకుపోతోన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రభాస్ బైక్ పై వెళుతుండగా గాజు ముక్కలు, కార్లు గాల్లో తేలుతున్నాయి.సాహో చిత్రంలో ప్రభాస్ చేయబోయే బీభత్సానికి ఇది శాంపిల్ మాత్రమే. రేస్ మొదలైంది.. సైలెంట్ గా ఉండండి అంటూ యూవీ క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. 

click me!