ఎన్టీఆర్‌ ట్రీట్‌ రెడీ.. `రామరాజు ఫర్‌ భీమ్‌` డేట్‌ ఫిక్స్..ఇక ఫ్యాన్స్ కి పూనకమే!

Published : Oct 17, 2020, 06:38 PM IST
ఎన్టీఆర్‌ ట్రీట్‌ రెడీ.. `రామరాజు ఫర్‌ భీమ్‌` డేట్‌ ఫిక్స్..ఇక ఫ్యాన్స్ కి పూనకమే!

సారాంశం

చాలా రోజులుగా ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురంభీమ్‌ పాత్ర లుక్‌, టీజర్‌ కోసం ఆయన అభిమానులు, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణ ఫలించింది. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. `రౌద్రం రణం రుధిరం`. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఇందులో కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చెర్రీతో బాలీవుడ్‌ నటి అలియాభట్‌ రొమాన్స్ చేయనుంది. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌తో శ్రియా శరణ్‌ జోడీ కట్టనున్నారు. 

ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ పున ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే రామ్‌చరణ్‌ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. 

ఇక చాలా రోజులుగా ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురంభీమ్‌ పాత్ర లుక్‌, టీజర్‌ కోసం ఆయన అభిమానులు, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణ ఫలించింది. `రామరాజు ఫర్‌ భీమ్‌` ఇచ్చే ట్రీట్‌పై క్లారిటీ వచ్చింది. మరో ఐదు రోజుల్లో ఎన్టీఆర్‌ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం స్పష్టం చేసింది. అంటే ఈ నెల 22న దసరా కానుకగా ఈ సర్‌ప్రైజ్‌ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు పుల్‌ ఖుషీ అవుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే