నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడిపై రేప్‌ కేసు.. పెళ్ళి చేసుకుంటానని మోసం!

Published : Oct 17, 2020, 05:11 PM IST
నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడిపై రేప్‌ కేసు.. పెళ్ళి చేసుకుంటానని మోసం!

సారాంశం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. గురువారం రాత్రి ఈ ఫిర్యాదు రాగా, అతడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. గత కొంతకాలంగా మహాక్షయ్‌ అత్యాచారం చేసిన మోసం చేశారని ఓ మహిళా ముంబయిలోని ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి ఈ ఫిర్యాదు రాగా, అతడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఆ వివరాల్లోకి వెళితే, పోలీస్‌ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. 38ఏళ్ళ బాధిత మహిళతో మహాక్షయ్‌ 2015 నుంచి 18 వరకు కలిసి ఉన్నాడని, 2015లో పశ్చిమ అంథేరిలో మహాక్షయ్‌ కొనుగోలు చేసిన ఇంటిని చూడ్డానికి వెళ్లిన ఆమెకి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిసి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని,  అతను ఆమెని మ్యారేజ్‌ చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. 

ఆ మహిళ గర్భం ధరించడంతో అబార్షన్‌ చేసుకోవాలని, బలవంతంగా గర్బస్రావం మందులు ఇచ్చారని ఆమె ఆరోపించింది. తనని పెళ్ళి చేసుకోవాలని బాధిత మహిళ మహాక్షయ్‌ని ప్రశ్నించినప్పుడల్లా మాట దాటేస్తూ తనని మూడేళ్ళు మోసం చేశాడని, 2018 జనవరిలో కూడా మరోసారి తమ వివాహం గురించి ప్రశ్నించగా, అతడు చేసుకోనని స్పష్టం చేశాడని, దీంతో వారి మధ్య గొడవలు పెరిగాయని, ఈ విషయంపై మహాక్షయ్‌ తల్లి యోగితా బలి కూడా తనని బెదిరించినట్టు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 

దీంతో 2018లో ఢిల్లీలోని బేగంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహాక్షయ్‌తోపాటు అతడి తల్లిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 376, 313 కేసులు నమోదు చేసి హైకోర్ట్ కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. హైకోర్టు మహాక్షయ్‌, అతడి తల్లికి ముందస్తు బెయిల్‌ మంజూర్‌ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సిందిగా బాధిత మహిళకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  ఈ మేరకు 2020 జులైలో ఓషివారా పోలీసు స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌లు 376(అత్యాచారం) 376 (2)(ఎన్‌) (పలుమార్లు అత్యాచారం చేయడం) 328(అంగీకారం లేకుండా గర్భస్రావం చేయడం) 417(మోసం చేయడం), 506(క్రిమినల్‌ బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.  దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. మహాక్షయ్‌తోపాటు ఆమె తల్లి యోగితా బలిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

బెంగాలీకి చెందిన నటుడు మిథున్‌ చక్రవర్తి హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో `గోపాల గోపాల`లో నటించిన విషయం తెలిసిందే. ఆయన మహాక్షయ్‌ `హాంటెడ్‌ 3డీ`, `లూట్‌` వంటి చిత్రాల్లో నటించాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే