కంగనాకి ముంబయి కోర్ట్ షాక్‌.. దేశ ద్రోహం కేసు నమోదు!

By Aithagoni RajuFirst Published Oct 17, 2020, 4:38 PM IST
Highlights

ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతకరమైన ట్వీట్లు చేశారని కాస్టింగ్‌ డైరెక్టర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మున్నావరలీ సయ్యద్‌ ముంబయిలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ మెట్రోపాలిటన్‌ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. 

కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మతపరమైన అసమ్మతిని సృష్టించేలా ట్వీట్లు చేసిన కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్ట్ ఆదేశించింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతకరమైన ట్వీట్లు చేశారని కాస్టింగ్‌ డైరెక్టర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మున్నావరలీ సయ్యద్‌ ముంబయిలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ మెట్రోపాలిటన్‌ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. 

కంగనాతోపాటో ఆమె సోదరి రంగోలిపై కూడా అలాంటి ట్వీట్లే చేశారని తెలిపారు. దీంతో పిటిషన్‌ స్వీకరించిన కోర్ట్ ఇద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్ట్ ఆదేశంతో ముంబయి పోలీసులు కంగనాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

సయ్యద్‌ తన పిటిషన్‌లో తెలిపిన వివరాలు చూస్తే, కంగనా పాపులర్‌ నటి అని, ఆమెకి చాలా పెద్ద అభిమాన గనం ఉందని, ఆమె రెండు వర్గాల ప్రజల మధ్య, సామాన్యుల మధ్య మత విభేదాలు సృష్టించేలా ట్వీట్‌ చేయడం వల్ల అవి చాలా మందికి చేరతాయన్నారు. ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా, ట్వీట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో చేసిన కామెంట్లని బట్టి విచారణ జరపాలని పిటిషనర్‌ తెలిపారు. 

ముఖ్యంగా హిందూ, ముస్లీంల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగనా వ్యాఖ్యలున్నాయని ఆయన ఆరోపించారు. ఐపీసీ సెక్షన్‌ 153ఏ, 295ఏ వంటి సెక్షన్ల కింద కంగనాపై, 124ఏ సెక్షన్‌ కింద కంగనా సోదరి రంగోలీపై కేసు నమోదు చేయాలని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కంగనాపై కర్నాటక కోర్ట్ ఆదేశాల మేరకు కేసు
నమోదైంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కంగనా తీవ్రంగా స్పందించారు. నెపోటిజం, డ్రగ్స్ మాఫియా, ముంబయి పోలీసుల వ్యవహారం, మహారాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ఆమె దుమ్మెత్తిపోశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేపై అనేక విమర్శలు చేశారు. దీంతో ఉద్దవ్‌ ఠాక్రే వర్సెస్‌ కంగనాలా మారింది సీన్. అంతేకాదు ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లా  పోల్చింది కంగనా.  దీంతో ముంబయిలోని తన కార్యాలయంపై దాడులు జరిగాయి. 

click me!