(NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్దాయి వెయిటింగ్ కు కారణం ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన భారీ సినిమాలు .. అవి సాధించిన సెన్సేషన్ హిట్స్. సుదీర్ఘ కాలంగా షూటింగు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా, అనేక విశేషాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. చరణ్ క్యారక్టరైజేషన్స్ కు అద్దం పడుతూ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆర్.ఆర్.ఆర్ లో ఏం కావాలనుకున్నారో, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా ఉండాలి ఫ్యాన్స్ అనుకున్నారో, ఎలాంటి యాక్షన్ కావాలనుకున్నారో.. అన్ని ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో పుష్కలంగా కనిపించాయి. దాంతో ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఈ నేపధ్యంలో నార్త్ ఇండియన్స్ ...హిందీ ట్రైలర్ చూసి ఎలా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ నటన వాళ్లకు నచ్చుతోందా అనేవి కీలకంగా మారాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ఎన్టీఆర్ చెప్పుకోవడం విశేషం. దాంతో ఆయన డిక్షన్ నార్త్ ఇండియన్స్ నచ్చేలా ఉందా అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.
నార్త్ ఇండియా మీడియా నుంచి,ట్రైలర్స్ కు వచ్చిన కామెంట్స్ ని పరిశీలిస్తే ...ఈ విషయం లో ఎన్టీఆర్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. హిందీ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ విన్నవారు...తమ నార్త్ ఇండియన్స్ లో ఒకరు మాట్లాడినట్లే అనిపించింది అంటున్నారు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తూ పులిలా గాండ్రించిన సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ గా చూస్తే అందులోని కిక్ కనబడుతుంది అని అంటున్నారు. ఎన్టీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ తర్వాత భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినా ఆశ్చర్యం లేదంటున్నారు. ట్రైలర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ కావాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్తున్నారు
ఇక మన సౌతిండయన్స్ విషయానికి వస్తే..ఎన్టీఆర్, రామ్ చరణ్ విడివిడిగా నటిస్తేనే.. వాళ్ళ పెరఫార్మెన్స్ కి, వాళ్ళ డాన్స్ స్టయిల్ కి ఫాన్స్ పండగ చేసుకుంటారు. ఎమోషనల్ గా కానీ, రొమాంటిక్ గా ని ఎవరికీ వారే అన్నట్టుగా ఉండే వీళ్ళిద్దరూ.. ఒకే స్క్రీన్ మీద కలిసి కనబడితే.. ఆ క్రేజ్ ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం అనేది నిజం. దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ - ఎన్టీఆర్ లని ఎలా చూపిస్తాడో అనుకున్న వారికీ రీసెంట్ గా విడుదలైన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పర్ఫెక్ట్ సమాధానం చేప్పేసింది.
రాజమౌళి మార్క్ దర్శకత్వం, రామ్ చరణ్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్, అలియా భట్, అజయ్ దేవగన్ కేరెక్టర్స్ తో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఈ ట్రైలర్ లో పోలీస్ గా ఉన్న రామ్ చరణ్, కొమరం భీం ఎన్టీఆర్ ఎక్కడ ఎలా కలిసారో? వాళ్ళు ఎందుకు కలవాల్సి వచ్చింది? కొమరం భీం - అల్లూరి శత్రువులని కలిసి ఎలా వేటాడారు.. ఇవన్నీ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో రివీల్ చేసారు. బ్రిడ్జ్ కింద భీం, అల్లూరి లు తాళ్లతో వేలాడుతూ వచ్చి చెయ్యి అందించడం అనేది హైలెట్ అనేలా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా అన్న అల్లూరి మాటలకి.. ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్సప్రెషన్ అదుర్స్. తొంగి తొంగి, నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోణ్ని ఏసుకుంటూ పోవాలి అని భీం చెప్పిన డైలాగ్.. ఈ నక్కల వేట ఎంతసేపు... కుంభస్థలాన్ని కొడదాం పదా అంటూ అల్లూరి గా చరణ్ చెప్పే డైలాగ్స్ ఫాన్స్ కి గూస్ బమ్స్ తెప్పిస్తున్నారు.
Also read 100 శాతం నిజం అనుకుంటున్నా.. RRR ట్రైలర్ పై చిరంజీవి, సమంత, పూజ హెగ్డే రియాక్షన్
రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్, చెయ్యి చెయ్యి కలిపి చేసే యుద్ధం, హీరోస్ ఇంట్రడక్షన్ సీన్స్, అల్లూరిలా రామ్ చరణ్ బాణాలతో శత్రువులని వేటాడడం, బైక్ ని ఎత్తిపట్టి కొమరం భీం బ్రిటిష్ సైన్యాన్ని చితక్కొట్టడం, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రతి షాట్, ప్రతి సీన్ ఫాన్స్ కి రచ్చ రచ్చ చేస్తోంది.
#Also read RRR: `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌కి షాకిచ్చిన అభిమానులు.. మీడియాకి రాజమౌళి క్షమాపణలు..