
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ చిత్రం ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర జైత్ర యాత్ర కొనసాగుతోంది.
దీనితో చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో 'అఖండ విజయోత్సవ జాతర' పేరుతో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుక దిగ్విజయంగా ముగిసింది. తమన్ మినహా చిత్ర యూనిట్ మొత్తం అఖండ విజయోత్సవ వేడుకలో పాల్గొంది. బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
విజయోత్సవ జాతరలో బాలయ్య ప్రసంగించారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి అఖండ టైటిల్ అనుకుంటున్నాను అని చెప్పగానే చాలా బావుంది అని అన్నాను. నాకు, బోయపాటికి బాగా కుదిరింది. కానీ ఒక సినిమా చేస్తున్నప్పుడు గత చిత్ర విజయం గురించి మాట్లాడుకోము.
బోయపాటి ఎప్పుడూ నాకు పూర్తి కథ చెప్పలేదు. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా కథ చెబుతారు. బోయపాటి నటీనటుల నుంచి, టెక్నీషియన్ల నుంచి ఏం కావాలో రాబట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న దర్శకుడు అని బాలయ్య ప్రశంసించారు. అఖండ చిత్రం ఈ పరిస్థితుల్లో విడుదలై మంచి విజయం సాధించడం మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చింది అని అన్నారు.
Also Read: Akhanda: అఖండ విజయోత్సవ జాతర.. పంచె కట్టులో బాలయ్య, ఎల్లో లెహంగాలో ప్రగ్యా మెరుపులు
Also Read: 'నా కొంగే జారేటప్పుడు నువ్వు చూడకుంటే సామీ'.. అందాలు ఆరబోస్తూ 'పుష్ప' పాటేసుకున్న దివి