Bigg Boss Telugu 5: అలగడం.. హగ్గులు చేసుకోవడం.. సిరి, షణ్ముఖ్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోందిగా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 09, 2021, 11:30 PM ISTUpdated : Dec 09, 2021, 11:31 PM IST
Bigg Boss Telugu 5: అలగడం.. హగ్గులు చేసుకోవడం.. సిరి, షణ్ముఖ్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోందిగా

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 5( Bigg Boss Telugu 5) ఎపిసోడ్ 96 ఎంటర్టైనింగ్ గా సాగింది. కొన్ని రోజులుగా హౌస్ లో ఎంటర్టైనింగ్ టాస్కులు నడుస్తున్నాయి. బుధవారం జరిగిన లాఫింగ్ టాస్క్ లో శ్రీరామ్, మానస్ మధ్య టై అయింది. దీనితో వీరిద్దరిలో విజేత ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించాలి అని బిగ్ బాస్ ఆదేశిస్తారు.

బిగ్ బాస్ తెలుగు 5( Bigg Boss Telugu 5) ఎపిసోడ్ 96 ఎంటర్టైనింగ్ గా సాగింది. కొన్ని రోజులుగా హౌస్ లో ఎంటర్టైనింగ్ టాస్కులు నడుస్తున్నాయి. బుధవారం జరిగిన లాఫింగ్ టాస్క్ లో శ్రీరామ్, మానస్ మధ్య టై అయింది. దీనితో వీరిద్దరిలో విజేత ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించాలి అని బిగ్ బాస్ ఆదేశిస్తారు. దీనితో మిగిలిన ఇంటి సభ్యులు ఎక్కువ మంది మానస్ వైపు మొగ్గు చూపుతారు. 

అంతలో మొదట మేమిద్దరం డిస్కస్ చేసుకుంటే మంచిది అని శ్రీరామ్ చెబుతాడు. సింపతీ కోసం నాకు సపోర్ట్ చేయవద్దు. నిజంగా నేను అర్హుడిని అయితే సపోర్ట్ చేయండి అని మానస్ చెబుతాడు. మానస్ కోసం నేను కాంప్రమైజ్ అవుతున్నట్లు శ్రీరామ్ ప్రకటిస్తాడు. దీనితో మానస్ విజేతగా నిలుస్తాడు. 

ఆల్రెడీ తామంతా మానస్ ని విజేతగా ప్రకటించడానికి రెడీ అయ్యామని.. నువ్వేదో త్యాగం చేసినట్లు ఫీల్ అవ్వద్దు అని కాజల్ అంటుంది. దీనితో కాజల్, శ్రీరామ్ మధ్య కాసేపు మాటల యుద్ధం సాగుతుంది. వీరిద్దరికి జరిగిన గొడవలో కాజల్ కన్నీరు పెట్టుకుంటుంది. 

అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వినోదాత్మకమైన టాస్క్ ఇస్తారు. సన్నీ.. బాలకృష్ణ లాగా, శ్రీరామ్.. చిరంజీవి లాగా, షణ్ముఖ్ సూర్య లాగా, సిరి జెనీలియా లాగా, కాజల్ శ్రీదేవిలాగా పెర్ఫామ్ చేయాలని చెబుతారు. సాంగ్ ప్లే అయినప్పుడు ఎవరి పాటకు వాళ్ళు డాన్స్ చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. 

అలా గబ్బర్ సింగ్, సింహా, హ్యాపీ, బొమ్మరిల్లు, ముఠామేస్త్రి చిత్రాల్లో పాటలకు ఆయా గెటప్పుల్లో ఉన్న వారు డాన్స్ పెర్ఫామ్ చేస్తారు. బాలయ్య గెటప్ లో సన్నీ అదరగొట్టాడు. బాలయ్య లాగా డైలాగులు చెబుతూ.. శ్రీదేవి గెటప్ లో ఉన్న కాజల్ ని అతడు ఆటపట్టించడం సరదాగా ఉంటుంది. ఆ శ్రీదేవిని చూసిన కళ్ళతో ఈ శ్రీదేవిని చూడలేకున్నాం అంటూ సన్నీ కాజల్ ని ఆటపట్టిస్తాడు. 

టాస్క్ ముగిసిన తర్వాత రోజులాగే సిరి, షణ్ముఖ్ అలకలు వ్యవహారం మొదలవుతుంది. చిన్న విషయానికి కూడా ఇద్దరూ గొడవ పెట్టేసుకుంటారు. అలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ హగ్గులు చేసుకుని ఒక్కటైపోతారు. ఇలా నేటి ఎపిసోడ్ సాగింది. 

Also Read: Akhanda: అఖండ విజయోత్సవ జాతర.. పంచె కట్టులో బాలయ్య, ఎల్లో లెహంగాలో ప్రగ్యా మెరుపులు

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్