RRR: కన్నీళ్లు ఆగడం లేదంటూ ప్రభుత్వాలకి హీరో నిఖిల్ రిక్వెస్ట్

Surya Prakash   | Asianet News
Published : Nov 29, 2021, 11:09 AM ISTUpdated : Nov 29, 2021, 11:12 AM IST
RRR: కన్నీళ్లు ఆగడం లేదంటూ ప్రభుత్వాలకి  హీరో నిఖిల్ రిక్వెస్ట్

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు అప్డేట్ లు రాగా తాజాగా మరో అప్డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుండి జననీ అనే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలుగు హీరోల్లో హీరో నిఖిల్ ఒకరు. కేవలం సినిమాల గురించే కాక సమకాలీన విషయాలపై కూడా  స్పందిస్తూంటారు.  తనకు నచ్చిన విషయం కానీ, నచ్చని విషయం ఏదైనా మొహమాటం లేకుండా ట్విట్టర్ ద్వారా  ఫ్యాన్స్ తో పంచుకుంటాడు. తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ సాంగ్ గురించి నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ట్రిపుల్ ఆర్’ నుంచి ‘జననీ’ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

నిఖిల్ ఈ సాంగ్ గురించి ట్వీట్ చేస్తూ... ” జనని సాంగ్‌ను ఇప్పటివరకు 20సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసింది ఈ సినిమా. కీరవాణి, రాజమౌళి..మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ సినిమాకు మాత్రం దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. 

 

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో  పిరియాడిక్ ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రటీమ్ . ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీవల నాటు నాటు అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం.  

ఈ సినిమా నుండి జననీ అనే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను కీరవాణి రాశారు. అంతే కాకుండా ఆయనే స్వరాలు సమకూర్చరు. ఈ పాట దేశభక్తి నేపథ్యంలో ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది. పాటలోని లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాట వీడియో చరణ్ తో పాటు ఎన్టీఆర్ అజయ్ దేవ్ గన్ శ్రియా లు కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా చిత్ర యూనిట్ కూడా ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ