BIMBISĀRA Teaser: నెత్తుటి ప్రవాహం సృష్టిస్తున్న కళ్యాణ్ రామ్.. ట్విస్ట్ అదిరిపోయింది

pratap reddy   | Asianet News
Published : Nov 29, 2021, 10:39 AM IST
BIMBISĀRA Teaser: నెత్తుటి ప్రవాహం సృష్టిస్తున్న కళ్యాణ్ రామ్.. ట్విస్ట్ అదిరిపోయింది

సారాంశం

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'Bimbisara'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఇక ఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. 

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'Bimbisara'. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఇక ఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. రాజ్యాలపై దండెత్తుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. 

టీజర్ లో Kalyan Ram వార్ ఎపిసోడ్స్ ని చూపించారు. ఖడ్గం చేతపట్టిన కళ్యాణ్ రామ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో బింబిసారుడి పరాక్రమాన్ని వర్ణిస్తూ పవర్ ఫుల్ డైలాగులు వినిపితున్నాయి. 'కొన్ని వందల రాజ్యాలు ఓ ఖడ్గానికి బానిసలైతే.. అంటూ బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ చెలరేగుతున్న విధానాన్ని వర్ణించారు. 

టీజర్ లో విజువల్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. కళ్ళు చెదిరేలా ఉన్న టీజర్ తప్పకుండా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. కళ్యాణ్ రామ్ వారియర్ కింగ్ గా లుక్ బావుంది. బింబిసారుడి జైత్ర యాత్ర ఎలా కొనసాగింది అని తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. 

Also Read: Shiva Shankar master: శివశంకర్ మాస్టర్ మృతి.. బాలయ్య, రాజమౌళి, పవన్, నారా లోకేష్ ఏమన్నారంటే

టీజర్ లో మరో క్రేజీ ట్విస్ట్ కూడా చూపించారు. టీజర్ మొత్తం మహా రాజు పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్ చివర్లో మోడ్రన్ యువకుడిలా దర్శనం ఇచ్చాడు. అంటే ఈ చిత్ర కథ రెండు కాలాల నేపథ్యంలో ఉండనుంది. బింబిసార చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. 

బింబిసారుడి కాలానికి, కళ్యాణ్ రామ్ మోడ్రన్ యువకుడిగా ఉన్న కాలానికి మధ్య లింక్ ఏంటనేది ఈ చిత్రంలో ఆసక్తికర అంశం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడిగా సంయుక్త మీనన్, కేథరిన్ నటిస్తున్నారు. వసిస్ట్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర
Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో