RRR ట్రైలర్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన జక్కన్న టీం

pratap reddy   | Asianet News
Published : Dec 01, 2021, 10:24 AM IST
RRR ట్రైలర్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన జక్కన్న టీం

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం RRR Movie జనవరి 7న రిలీజ్ కానుంది. దీనితో రాజమౌళి ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ జోరు పెంచుతున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం RRR Movie జనవరి 7న రిలీజ్ కానుంది. దీనితో రాజమౌళి ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ జోరు పెంచుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం రాంచరణ్, ఎన్టీఆర్, అలియా రంగంలోకి దిగనున్నారు. అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కాబోతోంది అని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. 

కానీ తాజాగా RRR Trailer రిలీజ్ వాయిదా పడింది. ఈ సంగతిని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లెజెండ్రీ లిరిసిస్ట్  Sirivennela Seetharama Sastry మృతితో టాలీవుడ్ లో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిరివెన్నెల గౌరవార్థం ట్రైలర్ వాయిదా వేయడమే కరెక్ట్ అని ఆర్ఆర్ఆర్ టీం భావించింది. 

ట్రైలర్ విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని తెలిపారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వీడియోకి దేశ వ్యాప్తంగా థండర్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ గురించి జక్కన్న ఒక్కో అప్డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. 

 

ఇదిలా ఉండగా సిరివెన్నెల మృతి టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిరివెన్నెల తనకు అత్యంత ఆప్తులు అని రాజమౌళి స్వయంగా తెలిపారు. తమ ఫ్యామిలీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఓటమిని ఒప్పుకోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి, మర్యాద రామన్న చిత్రాల్లో సిరివెన్నెల పాటలు రాశారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం సిరివెన్నెల 'దోస్తీ' అనే పవర్ ఫుల్ సాంగ్ అందించిన సంగతి తెలిసిందే. 

Also Read: Sirivennela: 3 సెకండ్లలోనే ఆ పాట, పొరపాటున స్వర్గానికి వెళితే.. సిరివెన్నెలపై ఆర్జీవీ కామెంట్స్

Also Read: Sirivennela: పంజా మూవీలో ఆ సాంగ్.. రామజోగయ్య శాస్త్రికి వార్నింగ్ ఇచ్చిన సిరివెన్నెల

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు