'రాధే శ్యామ్': ప్రభాస్ పాత్ర కు బేస్ ఆయన జీవిత చరిత్రే

By Surya PrakashFirst Published Oct 27, 2021, 1:45 PM IST
Highlights

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా  చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ఈ సంవత్సరం దసరా స్పెషల్ గా విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనావైరస్ వల్ల వచ్చిన విరామం కారణంగా, వచ్చే ఏడాది సంక్రాంతికి  వాయిదా పడింది.
 

చాలా గ్యాప్ తర్వాత  ప్రభాస్ 'రాధే శ్యామ్' టైటిల్ తో ప్రేమకథ చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు కావడంతో 'రాధే శ్యామ్' టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి...అందులో ప్రభాస్ పాత్ర ఏమిటి అనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

'రాధే శ్యామ్'లో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. ఇంతకీ విక్రమాదిత్య ఎవరు? అంటే పామిస్ట్ . అంటే చేయి చూసి జాతకం చెప్పే వ్యక్తి.  పామిస్ట్ గా ప్రభాస్ నటిస్తున్నారు.   ఈ టీజర్ లో ప్రభాస్ పోషించిన పాత్ర విక్రమాదిత్య గురించి న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. టైం మ్యాగజిన్ మీద, “భారత దేశ అత్యవసర పరిస్థితి గురించి ముందే పసిగట్టిన వ్యక్తి” అని రాసి ఉంటుంది. అలాగే, “విక్రమాదిత్య నాకు చాలా సహాయం చేశారు. ఆయన వల్ల నేను నా వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను” అని ఎవరో ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన మెసేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ కథకు ఆధారం ఓ రియల్ లైఫ్ పామిస్ట్ అంటున్నారు. 

Also read RRR movie prerelease event : ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... దుబాయిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న జక్కన్న!

 ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు చెయిరో విలియం జాన్ వార్నర్ లైఫ్ స్టోరీ ప్రేరణగా ఈ కథాంశాన్ని రెడీ చేశారని అనుకుంటున్నారు. చెయిరో గా ప్రసిద్ధి చెందిన విలియమ్.. ఐరిష్ కి చెందిన ఫేమస్ జ్యోతిష్కుడు. తన హస్తసాముద్రికం మరియు సంఖ్యాశాస్త్రంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వ్యక్తి.  ప్రపంచంలోని వివిధ సంఘటనలు మరియు భవిష్యత్ లో జరగబోయే ఇతర అంశాలను అంచనా వేయడంలో చెయిరో విలియం ప్రసిద్ది చెందాడు. ఈయన 1880లలో భారతదేశంలో జ్యోతిష్యశాస్త్ర నైపుణ్యాన్ని నేర్చుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి ఫేమస్ పామిస్ట్ జీవితం ఆధారంగానే ''రాధే శ్యామ్'' ఫ్లాట్ ని రాధాకృష్ణ కుమార్ రెడీ చేశారని.. వాస్తవ కథను కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Also read బాహుబలి కంటే మూడు రెట్లు.. నిజమా, ప్రభాస్ 'ఆదిపురుష్' పై అదిరిపోయే అప్డేట్

ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “రాధే శ్యామ్ ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఇంటెన్స్ ప్రేమకథ. యాక్షన్ హీరో నుండి లవర్ బాయ్ గా అతని పరివర్తన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది” అని ఆయన అన్నారు. రాధే శ్యామ్ 1960ల సమయంలో ఐరోపాలో జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న చిత్రం. ఈ చిత్రం యొక్క కొంత భాగాన్ని ఐరోపాలో షూట్ చేసినప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లలో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుంది, ఇవి 60 వ దశకంలో ఐరోపాను పోలి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. 
 
రాధే శ్యామ్'ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. 

click me!