NTR: ఎన్టీఆర్-సంజయ్ లీలా భన్సాలీ మూవీ టైటిల్?

Published : Oct 27, 2021, 02:50 PM ISTUpdated : Oct 27, 2021, 02:55 PM IST
NTR: ఎన్టీఆర్-సంజయ్ లీలా భన్సాలీ మూవీ టైటిల్?

సారాంశం

లేటెస్ట్ మీడియా కథనాల ప్రకారం.. ఓ మైథలాజికల్ కాన్సెప్ట్ ని ఎన్టీఆర్ కోసం Sanjay leela bhansali సిద్ధం చేశారట. ఇక ఈ చిత్రానికి టైటిల్ గా 'జై బావ్ రే' అనే టైటిల్ నిర్ణయించారట. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అది కూడా దేశం మెచ్చిన దర్శకులలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీతో అంటూ ప్రచారం సాగుతుంది. అప్పట్లో కొన్నాళ్ళు హల్చల్ చేసిన ఈ న్యూస్, అధికారిక ప్రకటన ఏమీ లేకపోవడంతో సల్లబడింది. తాజాగా మరోమారు ఈ వార్త తెరపైకి వచ్చింది. Ntr- సంజయ్ లీలా భన్సాలీ చిత్రం లాంఛనమే అంటూ వార్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. 


లేటెస్ట్ మీడియా కథనాల ప్రకారం.. ఓ మైథలాజికల్ కాన్సెప్ట్ ని ఎన్టీఆర్ కోసం Sanjay leela bhansali సిద్ధం చేశారట. ఇక ఈ చిత్రానికి టైటిల్ గా 'జై బావ్ రే' అనే టైటిల్ నిర్ణయించారట. ఈ ప్రాజెక్ట్ పట్ల ఎన్టీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించగా, ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం, మాములు విషయం కాదు. మరి నిజంగా ఈ చిత్రం పట్టాలెక్కితే ఎన్టీఆర్ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా అవుతుందని అనడంలో సందేహం లేదు.

 Also read RRR movie prerelease event : ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... దుబాయిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న జక్కన్న!
కాగా ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ రెండు చిత్రాలు ప్రకటించారు . ఒకటి దర్శకుడు కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నారు. అపజయం ఎరుగని టాప్ మోస్ట్ దర్శకులుగా ఉన్న ఈ ఇద్దరు డైరెక్టర్స్ నుండి వచ్చే ఎన్టీఆర్ చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. 

Also read RRR movie: రన్ టైం పై క్రేజీ గాసిప్... అమ్మో అన్ని గంటలా!
మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి RRR movie విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక రాజమౌళి దుబాయ్ లో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీపై అంచనాలు భారీ ఎత్తున నెలకొని ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ