RRR అప్డేట్: 2018లో మొదలు, అదే బైక్ తో ఫినిష్.. పోస్టర్ లో అది లేపేశారు

pratap reddy   | Asianet News
Published : Aug 26, 2021, 03:17 PM IST
RRR అప్డేట్: 2018లో మొదలు, అదే బైక్ తో ఫినిష్.. పోస్టర్ లో అది లేపేశారు

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇటీవలే చిత్ర యూనిట్ ఉక్రెయిన్ లో భారీ సాంగ్ షూట్ పూర్తి చేసుకుని వచ్చింది. దీనితో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయింది. చిన్న చిన్న పోర్షన్స్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని కూడా పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కొన్ని పికప్ షాట్స్ మాత్రం మిగిలి ఉన్నాయట. 

2018లో బైక్ షాట్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టారు. అనుకోని విధంగా అదే బైక్ షాట్ తో షూటింగ్ పూర్తయినట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నట్లు తెలిపారు. 

ఈ సంగతిని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ తరహాలో అప్డేట్ ఇచ్చింది. ఇంతకు ముందు వరకు ప్రతి పోస్టర్ లో రిలీజ్ డేట్ అక్టోబర్ 13 కనిపించేది. కానీ లేటెస్ట్ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేపేశారు. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వచ్చే ఏడాది ఉగాదికి వాయిదా పడ్డట్లు  ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్ తో ఆ అనుమానాలు బలపడ్డాయి. త్వరలో మారిన్నీ వివరాలు తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

 

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?