హీరోయిన్ కాకముందు సమంత జతకట్టాలనుకున్నఆ ముగ్గురు హీరోలు.. ఒకరు మహేష్ కాగా..

Published : Aug 26, 2021, 03:14 PM IST
హీరోయిన్ కాకముందు సమంత జతకట్టాలనుకున్నఆ ముగ్గురు హీరోలు.. ఒకరు మహేష్ కాగా..

సారాంశం

బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ పాల్గొన్న సమంత అనేక విషయాలపై స్పదించారు. త్వరలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 తెలుగు, తమిళ్ వర్షన్స్ విడుదల కానున్నాయి. 

లక్కీ లేడీ సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూ వైరల్ గా మారగా, ఆమె కామెంట్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ పాల్గొన్న సమంత అనేక విషయాలపై స్పదించారు. త్వరలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 తెలుగు, తమిళ్ వర్షన్స్ విడుదల కానున్నాయి. ఈ తరుణంలో తమిళుల మనోభావాలు కించ పరిస్తే తనను క్షమించాలని కోరుకున్నారు. ఏదైనా కావాలని చేయలేదు, ఆ పాత్రలో విలనిజం లేదని సమంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ విడుదల నాటి నుండి సమంత పాత్ర తమిళుల మనోభావలను కించపరిచేదిగా ఉందని తీవ్ర నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ప్రకటించారు ఆమె. వెంటనే కథను వినే మూడ్ లేదని, కొంచెం గ్యాప్ తరువాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తానని అన్నారు. అదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. 

హీరోయిన్ కాక ముందు మీరు జతకట్టాలనుకున్న హీరోలు ఎవరని యాంకర్ అడుగగా... సమంత తడుముకోకుండా మహేష్ బాబు, సూర్య, షారుక్ ఖాన్ పేర్లు చెప్పారు. ఈ ముగ్గురు హీరోల సరసన నటించాలని నాకు ఎంతో ఆసక్తి ఉండేదని సమంత తన ఒకప్పటి కోరిక బయటపెట్టారు. అయితే మహేష్ తో సమంత రెండు చిత్రాలు చేశారు. దూకుడు, బ్రహ్మోత్సవం చిత్రాలలో సమంత, మహేష్ కలిసి నటించడం జరిగింది. ఇక సూర్యతో సైతం రెండు చిత్రాలు చేశారు సమంత. అంజాన్, 24 చిత్రాలలో వీరు జతకట్టారు. అయితే షారుక్ తో నటించాలన్న ఆమె కోరిక అలాగే మిగిలి ఉందని మనసులో మాట బయటపెట్టారు సమంత. 

PREV
click me!

Recommended Stories

Akshay Kumar కారుకు ప్రమాదం, ఆటో నుజ్జునుజ్జు.. హీరోకి ఎలా ఉంది? అసలేం జరిగిందంటే?
Karthika Deepam 2 Today Episode: జ్యోను కన్న కూతురివి కాదన్న కార్తీక్- పడిపడి నవ్విన సుమిత్ర