వచ్చేసింది బిగ్ బాస్ 5.. టైమ్ అండ్ డేట్ ఫిక్స్డ్

Published : Aug 26, 2021, 12:42 PM ISTUpdated : Aug 26, 2021, 01:37 PM IST
వచ్చేసింది బిగ్ బాస్ 5.. టైమ్ అండ్ డేట్ ఫిక్స్డ్

సారాంశం

 బిగ్ బాస్ సీజన్ 5 షెడ్యూల్ కూడా వచ్చిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6:00 గంటలకు గ్రాండ్ గా సీజన్ 5 లాంచ్ కానుంది. అదే రోజున హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేయనున్నారు.   


మరో పది రోజుల్లో బిగ్ బాస్ సందడి మొదలు కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులు కిక్ పంచనుంది. బుల్లితెర, వెండితెరతో పాటు సోషల్ మీడియా సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్ అనేక నాటకీయ పరిణామాలకు వేదిక కానుంది. వరుసగా మూడో సీజన్ కి హోస్ట్ గా మారిన నాగార్జున ప్రొమోషన్స్ లో ఇరగదీస్తున్నాడు. 


కోటు బూటు ధరించి జెంటిల్మెన్ లుక్ లో ఉన్న నాగార్జున చేతిలో గన్ తో బోర్డమ్ ని షూట్ చేసి, ఎంటర్టైన్మెంట్ కి హామీ ఇస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 షెడ్యూల్ కూడా వచ్చిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6:00 గంటలకు గ్రాండ్ గా సీజన్ 5 లాంచ్ కానుంది. అదే రోజున హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేయనున్నారు. 


ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రచారం జరుగుతున్న ప్రకారం యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్, టిక్ టాక్ దుర్గారావు,యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, సురేఖా వాణితో పాటు మరికొందరు సెలెబ్రిటీలు బిగ్ బాస్ సీజన్ 5లో కాంటెస్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు. షోకి ఎంపికైన కంటెస్టెంట్స్ క్వారంటైన్ కావడం జరిగింది.

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్