RRR Release: ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళికి భారీ కటౌట్, ఎక్కడంటే...?

Published : Mar 24, 2022, 10:11 PM IST
RRR Release: ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళికి భారీ కటౌట్, ఎక్కడంటే...?

సారాంశం

స్టార్ హీరోల సినిమాలంటే పోటీ పడి మరీ భారీ కటౌట్స్ పెడుతుంటారు. కాని డైరెక్టర్ కు కటౌట్ అది కూడా భారీ మాసీవ్  కటౌట్ పెట్టడం చూశారా..? కానీ ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని నిజం చేశారు.  

స్టార్ హీరోల సినిమాలంటే పోటీ పడి మరీ భారీ కటౌట్స్ పెడుతుంటారు. కాని డైరెక్టర్ కు కటౌట్ అది కూడా భారీ మాసీవ్  కటౌట్ పెట్టడం చూశారా..? కానీ ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని నిజం చేశారు.  

సినిమా హీరోలకు భారీగా ఫ్యాన్స్ ఉంటారు. మాస్ హీరోకు ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. ఎంత చిన్న హీరోలు అయినా ఎంతో కొంత అభిమానులు  ఉండటం కామన్. హీరోలను ఫ్యాన్స్ ఎంతో ప్రేమిస్తారు. హీరోలను తమ సొంత ఇంటి మనుషులుగా భావిస్తూ ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. 

అంతే కాదు  స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు పూనకాలు వచ్చేలా ఎగురుతూ..భారీ కటౌట్లు.. పోస్టర్లు.. పూజలు , కొబ్బరికాయలు ఇలా రకరకాలుగా తమ అభిమాన స్టార్స్ పై ప్రేమను ఒలకబోస్తుంటారు. తమ ఫేవెరేట్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్‌లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. మీరు హీరోలకు కటౌట్లు పెట్టడమే ఇప్పటి వరకూ చూసి ఉంటారు. 

కాని ఒక డైరెక్టర్ కు కూడా భారీ కటౌట్ పెట్టడం ఎప్పుడైనా చూశారా..? ట్రిపుల్ ఆర్ ఫ్యాస్స్ ఈ పని చేశారు.  యావత్‌ భారతదేశం ఎదురుచూస్తోన్న ట్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కించిన దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. రాజమౌళిపై ప్రేమతో ఆయనకు భారీగా కటౌట్‌ కట్టారు ఆయన ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఈ భారీ కటౌట్‌ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తోంది.  

స్టూడెంట్‌ నెం.1 నుంచి మొన్నటి బాహబలి 2 దాకా జక్కన్న చెక్కిన ప్రతీ సినిమా బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌. ఇప్పుడు మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ట్రిపుల్ ఆర్ అన్నింటికి మించి రికార్ట్స్ క్రియేట్ చేయడం ఖాయం  అని నమ్మకంతో ఉన్నారు జక్కన్న. బాహుబలితో భారతీయ సినిమాకు టాలీవుడ్  రేంజ్‌ ఏంటో చూపించిన జక్కన్నకు అనేకమంది అభిమానులు ఏర్పడ్డారు. 

ఈ అభిమానంతోనే హైదరాబాద్‌ సుదర్శన్‌ 35 ఎంఎం  థియేటర్ దగ్గర రాజమౌళి భారీ కటౌన్ ను ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చాలా కాలం తరువాత రెండు సార్లు వాయిదా పడ్డ ట్రిపుల్ ఆర్ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ కాబోతోంది. 
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?