ఆలియా భట్ మీద అభిమానంతో..దుబాయ్ లో థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తానీ నటుడు

Published : Mar 24, 2022, 07:02 PM IST
ఆలియా భట్ మీద అభిమానంతో..దుబాయ్ లో థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తానీ నటుడు

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సెన్సేషనల్ మూవీ గంగూబాయ్ కతియవాడి. ఈ మూవీ మ్యానియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా గంగూబాయ్ ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంది. 

బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌  నటించి మెప్పించిన ఎక్ప్ పెర్మెంటల్ మూవీ  గంగూబాయి కతియవాడి. స్టార్ జీనియస్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి  బాక్సాఫీస్‌ ను శేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ..దూసుకుపోతోంది.  సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతున్నా.. గంగూబాయి మ్యానియా ఏమాత్రం తగ్గలేదు. 

మాఫీయా క్వీన్‌, ముంబయ్ లోని కామాటిపురా వేశ్య గంగూబాయ్ పాత్రలో అలియా ఓ ప్రయోగమే చేసింది. ఈ పాత్ర చేయడానికి పెద్ద పెద్ద సీనియర్ నటీమణులే ఆలోచించే పరిస్థితుల్లో, ఆలియాభట్ తన అందం, అభినయం, డైలాగ్‌లతో గంగూబాయ్ పాత్రలో మెరుపులు మెరిపించింది. తన నటనతో  విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటి వరకు గ్లామర్‌ రోల్స్‌తో మాత్రమే అలరించిన ఈ బ్యూటీ గంగూబాయ్ సినిమాతో తన సత్తా చాటుకుంది. 

 ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది ఆలియా భట్ . ఆమె నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మన దేశంలో.. అది కూడా అన్ని భాషల్లో.. ఆలియ భట్ కు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అంతే కాదు అలియా అభిమానుల సంఖ్య కూడా పెరిగింది. ఈ సినిమా ఇండియాతో పాటు ఫారెన్ లో కూడా విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంది. గంగూబాయి కతియవాడి మూవీని చూడటం కోసం ఒక అభిమాని ఏకంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. 

 

పాకిస్తాన్‌కు చెందిన మోడల్‌, యాక్టర్‌ మునీబ్ బట్‌.. అలియా భట్‌కు వీరాభిమాని. ఈ అభిమానంతోనే గంగుబాయి కతియవాడి  మూవీని తన భార్యతో కలిసి చూసేందుకు మొత్తం థియేటర్‌నే బుక్‌ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కూడా షేర్ చేసుకున్నాడు బునీబ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అయింది. దీంతో అలియా భట్‌ అనేక ఫ్యాన్‌  పేజీల్లో ఈ వీడియో  పోస్ట్‌  వైరల్ అవుతుంది. 

కామాఠిపురలోని రెడ్‌లైట్‌ ఏరియాలో గంగూబాయి అనే యువతి అన్యాయంగా ఆ కూపంలో ఎలా ఇరుక్కుంది. ఆతరువాత తన తెలివితేటలతో మాఫీయా క్వీన్‌గా ఎలా మారిందనే నిజజీవిత  కథతో గంగూబాయి కతియవాడి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మాఫియా క్వీన్‌ ఆఫ్‌ ముంబై అనే పుస్తకం ఆధానంగా రూపొందింది. అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ హష్మి, హ్యూమా ఖురేషీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ మూవీలో మెరుపులు మెరిపించారు.
 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా