
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్ సినిమా. జక్కన్న చెక్కిన ఈ మూవీ కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఐదు థియేటర్లలో ముందుగా సందడి చేయబోతోంది మూవీ.
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ మూవీ ట్రిపుల్ ఆర్. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్ లు గా నటించిన ఈసినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ లో ట్రిపుల్ ఆర్ సందడి చేయబోతోంది.
రేపు(25 మార్చ్) రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ కోసం వారం పదిరోజుల ముందు నుంచే సందడి మొదలయ్యింది. థియేటర్లు స్సెషల్ గా ముస్తాబు అయ్యాయి. ఇటు తెలంగాణ, ఆంథ్ర ప్రభుత్వాలు కూడా స్పెషల్ షోల కోసం పర్మీషన్లు ఇచ్చాయి. టికెట్ రేట్లు కూడా పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో ట్రిపుల్ ఆర్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసినిమా స్పెషల్ ప్రీమియర్ కోసం హైదరాబాద్ లో ఐదు థియేటర్లకు మాత్రమే పర్మీషన్ దొరికినట్టు తెలుస్తోంది.
రేపు తెల్లవారుజామును ఒంటిగంటకు.. ఆతరువాత మూడు గంటలకు.. ఆతరువాత 7 గంటలకు ట్రిపుల్ ఆర్ స్పెషల్ ప్రీమియర్లు పడబోతున్నాయి. అయితే ఫస్ట్ ప్రీమియర్లు మాత్రం హైదరాబాద్ లోని 5 థియేటర్లలో మాత్రమే పడబోతున్నాయి అందులో కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్,అర్జున్ థియేటర్లు ఉండగా మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ల లోనే 7 గంటలకంటే ముందు షో వేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ ఐదు థియేటర్లలో ఉదయం 1 గంటకు, ఉదయం 3 గంటలకు వీలును బట్టి షోస్ వేయనున్నారు.