
ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) రూపంలో రాజమౌళి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ రూ. 650 కోట్లు దాటిపోయాయి. ఐదు వందల కోట్లు వసూళ్లు సాధించిన అరుదైన చిత్రాల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ చేరింది. ఇక నైజాంలో ఆర్ ఆర్ ఆర్ భారీ లాభాల దిశగా వెళుతుంది. ఆరు రోజులకు గాను ఆర్ ఆర్ ఆర్ రూ. 73.15 కోట్లు షేర్ రాబట్టింది.
ఆర్ ఆర్ ఆర్ నైజాం హక్కులు దిల్ రాజు రూ. 70 కోట్లకు దక్కించుకున్నారు. అంటే వీకెండ్ ముగిసే నాటికే ఆర్ ఆర్ ఆర్ ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి చెప్పుకోదగ్గ పోటీలేదు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి సాలిడ్ వసూళ్లు దక్కే ఆస్కారం కలదు. ఏవిధంగా చూసినా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie Collections)దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
రాధే శ్యామ్ మూవీతో భారీగా నష్టపోయిన దిల్ రాజుకి ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉపశమనం కలిగించనుంది.అలాగే యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఓవర్ సీస్ లో ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు స్థిరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా ఏరియాల్లో ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ కి దూరంగా ఉంది. ఈ వీకెండ్ ముగిసే నాటికి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కి చేరే అవకాశం కలదు.
దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మాతగా ఉండగా కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి పాత్రల్లో ఫ్యాన్స్ ని అలరించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు.