
గోపీచంద్(Gopichand) ఇటీవల `సీటీమార్` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. వరుస పరాజయాల అనంతరం వచ్చిన `సీటీమార్` ఆయనకు మంచి బూస్ట్ నిచ్చింది. మరోవైపు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మారుతి(Maruthi) దర్శకత్వంలో గోపీచంద్ సినిమా చేస్తుండటం విశేషం. వీరి కాంబినేషన్‌లో `పక్కా కమర్షియల్`(pakka Commercial Movie) సినిమా రూపొందుతుంది. అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
`పక్కా కమర్షియల్` చిత్రంతో రాశీఖన్నా(Raashi Khanna) కథానాయిక. `జిల్` తర్వాత గోపీచంద్, రాశీఖన్నా కలిసి నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. చిత్ర టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధారణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం మరో విశేషం. ఈ మధ్యే విడుదలైన `పక్కా కమర్షియల్` టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా `పక్కా కమర్షియల్` మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై 1,2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. `ఇందులో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. `భలే భలే మగాడివోయ్`, `టాక్సీవాలా`, `ప్రతి రోజు పండగే` లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్ లో `పక్కా కమర్షియల్` సినిమా వస్తుంది.
గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి `భలేభలే మగాడివోయ్`, `ప్రతిరోజు పండగే`వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. `ప్రతి రోజు పండగే` సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. గోపీచంద్ `పక్కా కమర్షియల్` చిత్రాన్ని మాత్రం పక్కా స్కెచ్‌తో రిలీజ్ చేస్తున్నారు` అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
నటీనటులు: గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు
టెక్నికల్ టీం:
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్ - జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత - బన్నీ వాస్
దర్శకుడు - మారుతి
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
మ్యూజిక్ - జకేస్ బీజాయ్
సహ నిర్మాత - ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ - బాబు
ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భవ్
సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్