Samantha: కాస్ట్లీ గిఫ్ట్ తో సమంతని సర్ ప్రైజ్ చేసిన లేడి సూపర్ స్టార్..

Published : Mar 31, 2022, 09:53 AM IST
Samantha: కాస్ట్లీ గిఫ్ట్ తో సమంతని సర్ ప్రైజ్ చేసిన లేడి సూపర్ స్టార్..

సారాంశం

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోరు పెంచింది. వరుస చిత్రాలకు సైన్ చేస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. 

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోరు పెంచింది. వరుస చిత్రాలకు సైన్ చేస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో వరుస చిత్రాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి సరసన సమంత ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

'కణ్మణి రాంబో ఖతీజా' టైటిల్ తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆసక్తికర అంశం ఏంటంటే ఈ మూవీకి నయనతార కూడా ఒక నిర్మాత. 

ఈ చిత్రంలో నటించడం వల్ల సమంత, నయన్ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఈ చిత్ర సెట్స్ లో నయనతార బర్త్ డే ని సమంత సెలెబ్రేట్ చేసింది. అంతలా వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తాజాగా నయనతార సమంతకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. 

కాస్ట్లీ ఇయర్ రింగ్స్ ని సమంతకు నయనతార గిఫ్ట్ గా ఇచ్చింది. 'డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి అంటూ ఈ చిత్రంలోని తమ క్యారెక్టర్స్ పేర్లు వచ్చేలా లెటర్ కూడా పంపింది. నయన్ ఇచ్చిన గిఫ్ట్ ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థ్యాంక్యూ నయన్ అని సమంత కామెంట్ పెట్టింది. 

ప్రస్తుతం సమంత 'కణ్మణి రాంబో ఖతీజా' తో పాటు శాకుంతలం, యశోద లాంటి పాన్ ఇండియా చిత్రాలు కూడా చేస్తోంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా చేయబోతోంది సామ్. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కెరీర్ పరంగా సామ్ దూసుకుపోతోంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే