మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ వంటి స్టార్స్ విషయంలో ఆ క్రెడిట్ పూరీదే... రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 31, 2021, 4:13 PM IST
Highlights

ఒకపక్క ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తూనే, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇటీవల ఇండియాలో అతిపెద్ద సినిమా థియేటర్స్ చైన్ కలిగిన పీవీఆర్ తో RRR movie టై అప్ కావడం జరిగింది. దీనితో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పీవీపీ థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్ వీడియోలు ప్రదర్శించనున్నారు. 

ఒకపక్క ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తూనే, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇటీవల ఇండియాలో అతిపెద్ద సినిమా థియేటర్స్ చైన్ కలిగిన పీవీఆర్ తో RRR movie టై అప్ కావడం జరిగింది. దీనితో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పీవీపీ థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్ వీడియోలు ప్రదర్శించనున్నారు. 


తాజాగా రాజమౌళి ఓ కాలేజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో సంభాషించడం జరిగింది. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రభాస్ తో మీ చిత్రం మరలా ఎప్పుడు ఉంటుందని, ఓ విద్యార్థి అడుగగా...Prabhas చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి తనతో మూవీ చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. 


అంతే కాకుండా Rajamouli ప్రభాస్ గురించి మాట్లాడుతూ... బుజ్జిగాడు సినిమా తరువాత ప్రభాస్ నటనలో చాలా మార్పు వచ్చింది. కాబట్టి ప్రభాస్ ని అలా తయారు చేసిన క్రెడిట్ పూరి జగన్నాధ్ కి దక్కుతుంది అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ప్రభాస్ ఒక్కరే కాదు, ఎన్టీఆర్, Mahesh babu, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ని మాస్ ప్రేక్షకులు దగ్గర చేసిన ఘనత పూరీదే, అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు జక్కన్న. రాజమౌళి గతంలో కూడా ఓ సందర్భంలో పూరిలా త్వరగా నేను సినిమాలు తీయలేను. మా ఆవిడ మీరు పూరి దగ్గరకు వెళ్లి నేర్చుకోండి, అంటుంది. పూరి ఒప్పుకుంటే ఆయన దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాను, అంటూ చమత్కరించారు. 

Also read 'ఆర్.ఆర్.ఆర్' USA టిక్కెట్ రేట్లు: బాహుబలి కన్నా తక్కువే

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సైతం పూరి తన ఫేవరేట్ దర్శకుడని చెప్పడం విశేషం. పూరి అంటే నాకు జలసీ అని చెప్పిన విజయేంద్ర ప్రసాద్, అందుకే ఆయన ఫోటో ఎప్పుడూ తన వాల్ పేపర్ గా పెట్టుకుంటానని, అలీతో సరదాగా టాక్ షోలో చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి తాను తీయబోయే మహాభారతం మూవీలో కర్ణుడు పాత్ర ప్రభాస్ కి ఇస్తానని చెప్పడం జరిగింది. 

Also read ‘అన్‌స్టాపబుల్‌’ ఎపిసోడ్ 1 ప్రోమో వచ్చేసింది, ఇవి గమనించారా?

ఇక అనేక అవాంతరాల మధ్య షూటింగ్ పూర్తి చేస్తుకున్న ఆర్ ఆర్ ఆర్ 2022 జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. Ntr కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నవంబర్ 1న విడుదల కానుంది. 

click me!