బాలయ్య మార్క్ డైలాగ్స్ తో ఈ ప్రోమో అదిరిపోయింది. క్లాసీ షేర్వాణీ, శాలువా ధరించి ప్రోమోలో బాలయ్య ట్రెడిషనల్, స్టైలిష్ రాచరిక లుక్ లో కన్పించాడు. ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ హాజరైంది.
పెద్ద తెరపై అదరకొట్టే డైలాగులు చెప్పే బాలకృష్ణ... ఇప్పుడు యాంకర్ గా తనదైన శైలి డైలాగులతో చిన్న తెరపై అలరించేందుకు సిద్ధమయ్యిన సంగతి తెలిసిందే. ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అనే పోగ్రామ్ తో హంగామా చేయటానికి రెడీ అయ్యిపోయారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ (Aha)లో ప్రసారంకానున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా మోహన్ బాబు వచ్చారు. హోస్ట్‌గా బాలకృష్ణ దుమ్మురేపారని ఆ ప్రోమో చూస్తే అర్దమవుతోంది. బాలయ్య మార్క్ డైలాగ్స్ తో ఈ ప్రోమో అదిరిపోయింది. క్లాసీ షేర్వాణీ, శాలువా ధరించి ప్రోమోలో బాలయ్య ట్రెడిషనల్, స్టైలిష్ రాచరిక లుక్ లో కన్పించాడు. ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ హాజరైంది. ఇందులో బాలయ్య మోహన్ బాబును అడిగిన ప్రశ్నలు షో పై క్యూరియాసిటీ పెంచాయి.
“నేను మీకు తెలుసు…నా స్థానం మీ మనసు” అనే డైలాగ్‌తో బాలయ్య స్మాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ‘జై బాలయ్య’ అనే నినాదాలతో బాలయ్యకు స్వాగతం పలికారు. “చాదస్తం…ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చేస్తారు” అంటూ స్టార్టింగ్ లోనే బాలయ్యపై పంచ్ వేశారు. ఒకరి వయస్సు గురించి మరొకరు జోకులేసుకుని ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత కొన్ని సీరియస్ ప్రశ్నలను వేశారు బాలయ్య. అందులో చిరంజీవి గురించి, అలాగే మోహన్ బాబు జీవితం, ఆయన పార్టీ మారడం గురించి కూడా ప్రశ్నించారు. ఆ తరువాత మంచు లక్ష్మీ, మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. మీరు ఈ షో ప్రోమో చూడవచ్చు.
ఇక ఈ టాక్ షోకు గాను బాలయ్య ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున మొత్తం 12 ఎపిసోడ్లకు కలిపి 4.8 కోట్లు తీసుకోవచ్చని అంతర్గతంగా తెలుస్తున్న సమాచారం. దీన్ని ఛారిటీకే వినియోగిస్తారని తెలిసింది. సీజన్ 1 కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఆలోచనలో ఆహా ఉంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో గతం సమంతా చేసిన ప్రోగ్రాం ఆశించిన రెస్పాన్స్ దక్కించుకోలేదు.