
టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చి.. ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే ఈ దర్శకుడు.. తెలుగు సినిమా అంటే చీప్ గా చూసే బాలీవుడ్ కు, కోలీవుడ్ కు మన సినిమా గొప్పతనం ఏంటో చూపించాడు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనే విధంగా పరిస్థితులను మార్చిచూపించాడు. ఇప్పుడు తెలుగుహీరోలు పాన్ ఇండియా రేంజ్ లో రాణిస్తున్నారు అంటే.. అది రాజమౌళి గొప్పతనమే. ఎందరో దర్శకులకు.. ముఖ్యంగా మణిరత్నం లాంటివారికి కూడా ఆదర్శంగా నిలిచిన జక్కన్న డైరెక్టర్ కాకముందు నటుడని ఎంత మందకి తెలుసు..?
నటుడు అంటే పెద్ద నటుడని కాదు.. రాజమౌళి ఒక సినిమాలో బాల నటుడిగా వెండితెరపై కనిపించారు. అది కూడా ఇప్పుడు కాదు.. ఎప్పుడో నలబై ఏళ్ల క్రితం .. జక్కన్నకు 10 ఏళ్లు ఉన్నప్పుడు మాట. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. ఈ విషయం చెప్పారు రాజమౌళి. అయితే ఆయన నటించిన సినిమా రిలీజ్ అవ్వలేదట. ఆగిపోయిందన్నారు. రాజమౌళి బాల నటుడుగా పిల్లనగ్రోవి అనే సినిమాలో నటించారు. 1983లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ]
Allu Arjun: 10 కోట్ల ఆఫర్.. నో చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?
అయితే అప్పుడు రాజమౌళికి 10 ఏళ్ల వయస్సు ఉంటుందట. కాని ఆసినిమా రిలీజ్ కాలేదు. రాజమౌళి తండ్రి గొప్ప రచయిత అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకు రచయితగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉండగా.. కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఈసినిమాను డైరెక్ట్ చేశారట. కాని ఈమూవీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే జక్కన్న ఎన్టీఆర్ తో జరిగిన ఓ చిన్న వాదనలో ఈ విషయాన్ని వెల్లడించారట.
Charmy Kaur: పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన చార్మి కౌర్, ఆహీరో ఒప్పుకోగానే చేసుకుంటుందట..?
తారక్, రాజమౌళి.. నేను సీనియర్ అంటే నేను సీనియర్ అని చిన్న గొడవేసుకున్నారట. సరదాగా జరిగిన ఈ సంబాషణల్లో నేను నీకంటే ముందు బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చాను అని ఎన్టీఆర్ అనగా.. రాజమౌళి నీకంటే ముందే నేను బాలనటుడిగా నటించాను అని అసలు సీక్రేట్ ను విప్పారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయడానిక రెడీ అవుతున్నాడు. ఈమూవీకి సబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. మహేష్ గుంటూరు కారం సినిమా అయిపోగానే..జక్కన్నతో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాడు.