#Salaar ఎర్లీ మార్నింగ్ షో ఎన్నింటికి పడుతుందంటే...

Published : Dec 16, 2023, 09:08 AM IST
#Salaar ఎర్లీ మార్నింగ్  షో  ఎన్నింటికి పడుతుందంటే...

సారాంశం

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న తాజా చిత్రం స‌లార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే. 

పాన్  ఇండియా మూవీ 'సలార్' డిసెంబర్ 22న రిలీజ్ కు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరోవైపు చిత్ర నిర్మాతలు సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ నేపధ్యంలో ఎర్లీ మార్నింగ్ షో లకు ఫర్మిషన్ వచ్చిందని సమాచారం. ఉదయం ఒంటిగంటకు ఈ షోలు పడనున్నాయి. హైదరాబాద్ లో ఆ ఉత్సవం అప్పుడే మైదలైపోయింది. అలాగే సినిమా రేట్లు RRR టిక్కెట్ రేట్లుకు ఫర్మిషన్ ఇచ్చారని తెలిసింది. 

తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు పర్మిషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. సలార్ నైజాం హక్కులను మైత్రి నిర్మాతలు భారీ ధరకు దక్కించుకుంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం మైత్రి రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే  సలార్ నిర్మాతలైన హోం బలే ఫిలిమ్స్ వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వానికి అప్లై చేశారు. అయితే ఈ విషయంలో హోం బలే నిర్మాతలు UV క్రియేషన్స్ సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్  ప్రభాస్ సొంత బ్యానర్ అనే విషయం తెలిసిందే. అందుకే సలార్ ఏపీ టికెట్ హైక్స్ కోసం UV క్రియేషన్స్ నిర్మాతలను సలార్ మేకర్స్ రంగంలోకి దింపుతున్నారని సమాచారం.
  
 పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న తాజా చిత్రం స‌లార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.విడుదల కు కొద్ది రోజులే సమయం ఉండటమే టీమ్  ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలో ప్రభాస్, పృద్వీరాజ్  తో రాజమౌళి ఇంటర్వూ లు చేసి వీడియో వదులుతున్నారు.  

 ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఏ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే సలార్ ర‌న్‌టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌లార్ ట్రైల‌ర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో మేక‌ర్స్ స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  

 ‘సలార్‌’ పాన్‌ ఇండియా రికార్డులను తిరిగిరాయడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్‌’ది మొదటిస్థానం అని చెప్పాలి. టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ కాగానే ఓ రేంజిలో బుక్కింగ్స్ జరుగుతున్నాయి. ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌ కలయికలో వస్తున్న ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా ఈ నెల 22న విడుదల కానుంది. 

సలార్, వరద రాజ మన్నార్‌ స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ  హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?