
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.విడుదల కు కొద్ది రోజులే సమయం ఉండటమే టీమ్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలో ప్రభాస్, పృద్వీరాజ్ తో రాజమౌళి ఇంటర్వూ లు చేసి వీడియో వదులుతున్నారు. ఈ మేరకు సినిమాలో కీలకంగా చేస్తున్న #PrithviRajSukumaran ఈ ఇంటర్వూలో చెప్పిన కొన్ని విషయాలు బయిటకువచ్చి వైరల్ అవుతున్నాయి.
వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనపడనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ... #Salaar చిత్రం ఎంతో పాపులర్ అయ్యిన #GameofThrones స్దాయిలో ఉంటుంది. చక్కటి డ్రామా, క్యారక్టర్ డైనమిక్స్ ఉంటాయి. అనేక పాత్రలు, వాటి స్కేల్ ఇంతని చెప్పలేము. అన్నిటికన్నా ముఖ్యంగా నాది అద్బుతమైన పాత్ర అని నమ్ముతున్నాను. ఇక #PrashanthNeel సినిమా అంటే ఆయనతో పనిచేయటానికి ఎవరు ఇష్టపడరు అంటూ చాలా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చారు.
రీసెంట్ గా ఈ సినిమాలో తన పాత్రకు (వరద రాజ మన్నార్) డబ్బింగ్ పూర్తి చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సందర్భంగా సలార్ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశానని తెలుపుతూ.. ట్విట్టర్‌లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
‘సలార్ ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్స్ పూర్తయ్యాయి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నుంచి వివిధ భాషలలో పనిచేస్తున్నాను.. నా పాత్రలన్నింటికీ నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. అయితే ఒకే క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో 5 భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఫస్ట్ టైం ఇది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి డబ్బింగ్ చెప్పాను. ఇది చేయడానికి తగిన మూవీ. డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో దేవా, వరద మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారు. మీరంతా వచ్చేయండి’ అంటూ పృథ్వీరాజ్ రాసుకోచ్చాడు.
సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. సలార్ మూవీలో యాక్షన్ సీన్స్‌తో పాటు వయోలెన్స్ ఎక్కువ ఉండడం వలన ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే సలార్ రన్‌టైం 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు సలార్ ట్రైలర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో మేకర్స్ సలార్ నుంచి రెండో ట్రైలర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
‘సలార్’ పాన్ ఇండియా రికార్డులను తిరిగిరాయడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్’ది మొదటిస్థానం అని చెప్పాలి. టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ కాగానే ఓ రేంజిలో బుక్కింగ్స్ జరుగుతున్నాయి. ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కలయికలో వస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ఈ నెల 22న విడుదల కానుంది.
సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.