ఆర్ ఆర్ ఆర్ పై ఆశలు వదిలేసుకోండి... మరో బ్యాడ్ న్యూస్ ఆన్ ది వే?

By team teluguFirst Published Sep 11, 2021, 1:50 PM IST
Highlights

థియేటర్స్ విషయంలో తెలుగు రాష్ట్రలతో పాటు, ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆర్ ఆర్ ఆర్ మూవీని 2022కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉన్నారట.

రాజమౌళి ఏనాడూ చెప్పిన సమయానికి మూవీ విడుదల చేయడు. ఇది పరిశ్రమలో అందరికీ తెలిసిన చెడ్డ నిజం. పర్ఫెక్షన్ కోసం ఏళ్ల తరబడి సినిమాను చెక్కే రాజమౌళిని జక్కన్న అని పిలిచేది. అనుకున్న సమయానికి అనుకున్న బడ్జెట్ లో మూవీ పూర్తి చేయడం దర్శకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధానమైంది. ఆ క్వాలిటీ రాజమౌళిలో అస్సలు కనిపించదు. ఇంత బ్యాడ్ క్వాలిటీ ఉన్న రాజమౌళిని ఎవరూ పల్లెత్తి మాట అనరు. కారణం బ్లాక్ బస్టర్ టాక్ లో ఈ లోపాలన్నీ కొట్టుకుపోతాయి. 


ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 2019లో సెట్స్ పైకి వెళ్ళింది. 2020 జులై నెలలో మూవీ విడుదల చేయనునట్లు రాజమౌళి ప్రకటన రోజే వెల్లడించారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ విషయంలో పక్కా ప్రణాళిలతో ఉన్న రాజమౌళి, చెప్పిన ప్రకారం థియేటర్స్ లో దింపుతారని అందరూ భావించారు. 


రాజమౌళి గత చిత్రాల మాదిరి ఆర్ ఆర్ ఆర్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా ఒకింత ఎక్కువే లేటు అయ్యింది. దీనికి అనేక కారణాలుండగా.. ప్రధాన కారణం కరోనా వైరస్. లాక్ డౌన్ కారణంగా 2020లో షూటింగ్ చేయడం కుదరలేదు. అలా షూటింగ్ ఊపందుకోగానే సెకండ్ వేవ్ వచ్చి మరోమారు అడ్డుకట్ట వేసింది. 


అయితే మూవీ షూటింగ్ పూర్తి చేసిన రాజమౌళి మూడవ వాయిదా తేదీ అయిన అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రోమోల ద్వారా తెలియజేశారు. అయితే థియేటర్స్ విషయంలో తెలుగు రాష్ట్రలతో పాటు, ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆర్ ఆర్ ఆర్ మూవీని 2022కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉన్నారట. పూర్తి స్థాయిలో థియేటర్స్ అందుబాటులోకి రాకుండా ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రం విడుదల చేయడం వలన వసూళ్లు పై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ ఫోన్ చేయడం ఖాయమే అని అంటున్నారు. ఇది ఆర్ ఆర్ ఆర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే అంశమే. 
 

click me!