
రొమాంటిక్ సినిమాల నుంచి బాలీవుడ్ ఇప్పుడు మాస్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాల వైపు చూస్తోంది. కానీ 90ల్లో బాలీవుడ్‌లో రొమాంటిక్ సినిమాలకు అడ్డాగా నిలిచింది. ఆ సన్నివేశాలతో జనాలను కట్టిపడేసేది. స్పెషల్ ఏంటంటే.. 29 ఏళ్ల కిందట వచ్చిన ఓ బాలీవుడ్ సినిమాను కేవలం 6 కోట్ల రూపాయలతో తీశారు. ఇది రొమాంటిక్ సినిమా. అందుకే ఇందులో హీరో హీరోయిన్ ఏకంగా 47 సార్లు లిప్ లాక్స్ ఉన్నాయి. ఈ రొమాంటిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 78 కోట్లు కొల్లగొట్టింది.
ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు 1996లో వచ్చిన రాజా హిందుస్తానీ సినిమా. అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలోని 8 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 29 ఏళ్లు అయింది.
ధర్మేష్ దర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేమ గొప్పతనం గురించి చెబుతుంది. ఒక చిన్న ఊరి క్యాబ్ డ్రైవర్, ఒక ధనవంతురాలైన అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ 47 ముద్దు సీన్లలో కనిపించారు. 90ల్లో ఎక్కువ ముద్దు సీన్లు ఉన్న సినిమాగా ఇది నిలిచింది. అయితే ఈ సినిమాలో కావాలని ఏ సీన్ కూడా పెట్టలేదు. కథ, సీన్లకు తగ్గట్టుగా ముద్దు సీన్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది.
రాజా హిందుస్తానీ సినిమా ఏకంగా 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. దీంతో పాటు 7 స్క్రీన్ అవార్డులు కూడా అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ మ్యూజిక్ లాంటి చాలా అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. కలెక్షన్ల పరంగా ఈ సినిమా 1990లో చాలా రికార్డులు క్రియేట్ చేసింది. హమ్ ఆప్ కే హై కౌన్, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై సినిమాల కలెక్షన్ల రికార్డులను రాజా హిందుస్తానీ బ్రేక్ చేసింది.
కొన్ని సంవత్సరాలుగా వెనకబడ్డ బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన యానిమల్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు, విక్కీ కౌశల్-రష్మిక మందన్న కలిసి నటించిన ఛావా సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. దీనికి ముందు బాలీవుడ్ సినిమాలు వరుస ఓటములతో సతమతమయ్యాయి. సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు వెలవెలబోయాయి. కలెక్షన్లలో కూడా వెనకబడిపోయింది.