
ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం పెద్ద సంచలనం అయింది. ఆమె నిద్ర మాత్రలు తీసుకుని సూసైడ్ కి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ వెంటనే స్పందించి పోలీసుల సహాయంతో కల్పనని ఆసుపత్రికి తరలించారు. నిద్రమాత్రలు డొసేజ్ ఎక్కువ కావడంతో కల్పన స్పృహ కోల్పోయారు. వైద్యులు అందించిన ట్రీట్మెంట్ తో కల్పన తిరిగి కోలుకున్నారు.
ఆమె ఆసుపత్రిలో ఉన్నంత సేపు ఆమె భర్తపై, కుమార్తె దయపై అనేక వార్తలు వినిపించాయి. భర్తతో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూతురితో విభేదాలు గొడవ వల్లే కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆసుపత్రిలో తాను సూసైడ్ కి ప్రయత్నించలేదని కల్పన స్టేట్మెంట్ ఇచ్చారు.
అభిమానులకు, మీడియాకి మరింత క్లారిటీ ఇచ్చేందుకు కల్పన స్వయంగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అసలు తాను ఆత్మహత్యకే ప్రయత్నించలేదని, తన ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నా గురించి చాలా అసత్యాలు ప్రచారం జరుగుతున్నాయి. వాటన్నింటి గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ప్రస్తుతం నా వయసు 45 ఏళ్ళు. ఈ వయసులో నేను పీహెచ్ డీ చేస్తున్నా. అదే విధంగా ఎల్ఎల్ బి చదువుతున్నా. ఇదంతా నా భర్త ఎంకరేజ్ మెంట్ వల్ల సాధ్యం అవుతోంది.
ప్రస్తుతం ఉన్న మ్యూజికల్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా. వీటన్నింటి వల్ల నాకు ఒత్తిడి ఉంది. దీనితో కోనేళ్ళుగా నిద్ర సరిగ్గా రావడం లేదు. నిద్రలేమికి సంబంధించిన ఇన్సోమ్నియాతో బాధపడుతున్నాను. దీనితో డాక్టర్ దగ్గరకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. డాక్టర్ నాకు కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ ని నేను అనుకోకుండా ఓవర్ డొసేజ్ తీసుకున్నా. అందువల్లే స్పృహ కోల్పోయా అని కల్పన తెలిపింది.
నా భర్త వల్లే మీ ముందు ఈ రోజు నేను ఇలా బతికి ఉన్నాను. సరైన టైంకి ఆయన స్పందించి పోలీసుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతకి మించి ఇంకేమి జరగలేదు. నేను సూసైడ్ కి ప్రయత్నించలేదు. ప్రసాద్ ప్రభాకర్ లాంటి భర్తని, దయ లాంటి కుమార్తెని పొందడం నేను చేసుకున్న అదృష్టం అని కల్పన తెలిపారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకి, అభిమానులకి, నాతోటి సింగర్స్ కి కృతజ్ఞతలు అని కల్పన పేర్కొన్నారు.