`పెళ్లి చూపులు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన రీతూ వర్మ.. ఇటీవల నానితో `టక్ జగదీష్` చిత్రంలో ఆకట్టుకుంది. బలమైన పాత్రలో మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ప్రస్తుతం నాగశౌర్యతో `వరుడు కావలెను` చిత్రంతో రాబోతుంది.
రీతూ వర్మ(Ritu Varma)..ఆసక్తికర విషయాలను వెల్లడిచింది. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడూ మ్యారేజ్ చేసుకోబోయేది వెల్లడించింది. అంతేకాదు మ్యారేజ్‌పై వాళ్ల ఫ్యామిలీ ఓపీనియన్ ఏంటో తెలిపింది. తాజాగా ఆమె మీడియాతో ఈ విషయాలను వెల్లడించింది. నాగశౌర్య(Naga Shaurya)తో కలిసి రీతూ వర్మ `వరుడు కావలెను`(Varudu Kavalenu) చిత్రంలో నటించింది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. Varudu Kavalenu ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం Ritu Varma మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
`పెళ్లి చూపులు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన రీతూ వర్మ.. ఇటీవల నానితో `టక్ జగదీష్` చిత్రంలో ఆకట్టుకుంది. బలమైన పాత్రలో మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ప్రస్తుతం naga Shauryaతో `వరుడు కావలెను` చిత్రంతో రాబోతుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియా ఇంటరాక్షన్‌లో తన Marriageపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్ రెండుమూడేళ్లు అవుతుందని చెప్పింది.
అయితే మ్యారేజ్ విషయంలో ఇంట్లో(పేరెంట్స్) నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రయారిటీ ఉండే, నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.
ప్రస్తుతం నటిస్తూ `వరుడు కావలెను` చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది ఫీమేల్ సెంట్రిక్ చిత్రం కాదని, పూర్తిగా లవ్ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని పేర్కొంది.
నాగశౌర్యతో తన పెయిర్ బాగా సెట్ అయ్యిందని చెప్పింది రీతూ. సినిమాలో లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుందని, రెగ్యులర్ గా అనిపించదని, ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా నదియాపై ఆమె ప్రశంసలు కురిపించారు. `నదియా గారు ఇప్పటి కొన్ని పవర్ ఫుల్ రోల్స్ చేశారు. కానీ ఇప్పటివరకూ చేయని ఓ ఇన్నోసెంట్ రోల్ లో కనిపిస్తారు. నదియా గారి క్యారెక్టర్ కి అందరూ ఇంప్రెస్ అవుతారు. ఆవిడతో నటించడం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను` అని తెలిపింది రీతూ.
also read: అమలాపాల్ సంచలనం.. ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్.. బర్త్ డే రోజు క్రేజీ అప్‌డేట్..
`పెళ్లి చూపులు` తర్వాత మళ్ళీ అలాంటి రోల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ రాలేదు. మధ్యలో తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాను, కానీ అవి రిలీజ్ లేట్ అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ తో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ లో మరో సినిమాతో పాటు మరో వెబ్ సిరిస్ చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదని చెప్పింది.
also read: కూకట్‌పల్లి కోర్ట్ లో సమంతకి ఊరట.. ఆ కామెంట్లు తొలగించాలని ఆదేశం..