
చిరంజీవి(Chiranjeevi) వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమాకు క్రేజ్ వస్తుంది. అలాగే ప్రాజెక్టుకు ప్లస్ అవుతుంది. అయితే ఆయన్ని ఒప్పించి వాయిస్ ఓవర్ అడగటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ వరస ప్రాజెక్టులో బిజిగా ఉన్న చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటమూ తేలిగ్గా జరిగే పనికాదు. అయితే ఇప్పుడు ఆయన ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అదే `రంగమార్తాండ`(Rangamarthanda).
తనదైన సినిమాలతో తెలుగు పరిశ్రమలో ముద్ర వేసిన కృష్ణ వంశీ(Krishna Vamshi) ఇప్పుడు ‘రంగ మార్తాండ’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్తిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు సినీ కీలక నటీనటులతో అంతకు మించిన కథాబలంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దర్శకుడు Krishna Vamshi ఇప్పుడు ఆసక్తికర బిగ్ అప్డేట్ ని ఇచ్చాడు. ఈ సినిమా కోసం టాలీవుడ్ మెగాస్టార్ Chiranjeevi తన వాయిస్ ఓవర్ ని అందిస్తున్నాడు. ఈ ఈ విషయాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపిన కృష్ణవంశీ ‘తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని’ తెలిపారు.
రంగమార్తాండ మొదలై చాలా కాలమే అయింది. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. మొత్తానికి ఇప్పుడు విడుదలకు ముస్తాబు అవుతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ఈ మూవీ ఒక మరాఠీ చిత్రానికి రీమేక్. కృష్ణవంశీ తనదైన శైలిలో తీస్తున్నారు ఈ రీమేక్ చిత్రాన్ని. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఇవ్వడం మరో ప్రత్యేకత. అడగ్గానే, తన గొంతుని అరువు ఇచ్చినందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.
also read: అమలాపాల్ సంచలనం.. ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్.. బర్త్ డే రోజు క్రేజీ అప్డేట్..