'పెళ్లి చూపులు' పిల్లకి ఆ పదం నచ్చట్లేదట

Published : Sep 17, 2019, 04:48 PM IST
'పెళ్లి చూపులు' పిల్లకి ఆ పదం నచ్చట్లేదట

సారాంశం

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సొంత భాషలో కొన్ని సినిమాలు చేశాక ఇతర ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంటే కొంత గ్యాప్ రావడం కామన్. 

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సొంత భాషలో కొన్ని సినిమాలు చేశాక ఇతర ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంటే కొంత గ్యాప్ రావడం కామన్. అయితే దాదాపు రెండేళ్ల అనంతరం 'పెళ్లి చూపులు' పిల్ల రీతూ వర్మ తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో 'కామ్ బ్యాక్' ఫిల్మ్ అంటూ కథనాలు రాసేస్తున్నారట. 

అయితే ఆ కమ్ బ్యాక్ అనే పదం ఈ తెలుగు భామకు ఏ మాత్రం నచ్చలేదట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీతూ అందుకు వివరణ ఇచ్చింది.'ఎందుకు అలా అంటున్నారో అర్ధం కావడం. కేశవ సినిమా తరువాత తమిళ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేశాను. ఆ సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి.  భాషతో సంబంధం లేదని తెలిపింది. 

అలాగే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కూడా నన్ను చూస్తున్నారని అయితే దానికి 'కమ్ బ్యాక్' అనే పదం వాడాల్సిన అవసరం లేదని  రీతూ తెలియజేసింది. అమ్మడు శర్వానంద్ తో ఇటీవల ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతోంది. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు