మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

Published : Sep 17, 2019, 03:45 PM ISTUpdated : Sep 17, 2019, 04:17 PM IST
మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఎంతగానో ఎదురుచూస్తోంది. బుధవారం రోజు సైరా ట్రైలర్ విడుదల కానుండడంతో ఇప్పటి నుంచే హంగామా మొదలైపోయింది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. సైరా ట్రైలర్ రిలీజ్ కు టైం కుదిరినట్లు తెలుస్తోంది. బుధవారం రోజు సాయంత్రం 5గంటలకు సైరా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో థియేటర్స్ లో సైరా ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది. విజయవాడలోని అప్సర థియేటర్, గుడివాడలోని జి3  సింధూర, బందర్ లోని శ్రీ వెంకట్ థియేటర్స్ లో సైరా చిత్ర ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. 

ఇదిలా ఉండగా నైజాం ఏరియాలో సుదర్శన్ లాంటి థియేటర్స్ లో సైరా ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది. నైజాం థియేటర్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే అభిమానులు సైరా ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు