బాహుబలిని మించిపోయిన 'సైరా'!

By tirumala ANFirst Published Sep 17, 2019, 4:02 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర హంగామా మొదలైంది. సెప్టెంబర్ 18 బుధవారం రోజు ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఇక కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పట్లు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉండగా సైరా చిత్ర త్రీకరణ, నిర్మాణ విలువలు తెలుగు సినీ వర్గాలని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తెలుగువారికి గర్వకారణంగా మారిన బాహుబలి చిత్రాన్ని సైతం మించేలా సైరా మేకింగ్ జరిగింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రం కోసం దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు. 

సైరా చిత్ర విఎఫెక్స్ కి సంబంధించిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం విఎఫెక్స్ కోసమే 45 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 17 విఎఫెక్స్ సంస్థలు సైరా చిత్రం కోసం పగలు రాత్రి కష్టపడ్డాయి. 

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి 2 లో 2400 విఎఫెక్స్ షాట్స్ ఉపయోగించారు. సైరా నరసింహారెడ్డిలో ఏకంగా 3400 విఎఫెక్స్ షాట్స్ ఉన్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సైరా చిత్రంలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో అని. 

ఈ చిత్ర చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డట్లు ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. కాగడాల వెలుతురులో కొన్ని సన్నివేశాలు, అండర్ వాటర్ లో ఫైట్ సీన్స్ ఇలా సైరా చిత్రం అభిమానులకు విజువల్స్, యాక్షన్ ఫీస్ట్ కాబోతోంది. 

click me!