రితిక సింగ్ గ్లామరస్ రోల్స్ తో అలరిస్తుందా

Published : Apr 10, 2017, 01:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రితిక సింగ్ గ్లామరస్ రోల్స్ తో అలరిస్తుందా

సారాంశం

గురుతో మాంచి ఇమేజ్ సంపాదించిన రితిక సింగ్ స్లమ్ గాళ్ గా ప్రేక్షకులను మెప్పించిన రితిక లారెన్స్ శివలింగలో కమర్షియల్ హీరోయిన్ గా రితిక

'గురు' చిత్రంలో మురికివాడల అమ్మాయిగా జీవించిన రితిక సింగ్‌ స్వతహాగా బాక్సర్‌. బాక్సింగ్‌ తెలిసిన అమ్మాయి కావాలంటూ దర్శకురాలు సుధ కొంగర చాలా మంది బాక్సర్లని చూసి ఫైనల్‌గా రితికని ఎంపిక చేసుకుంది. నటనపై ఆసక్తి లేకపోయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రితిక ఆ చిత్రం మూడు వెర్షన్లలోను హీరోయిన్‌ రోల్‌ చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. మొత్తానికి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రితిక.

 

అయితే రితిక గురు సినిమాతో సంపాదించిన ఇమేజ్ ఆమె హీరోయిన్ గా ఎదుగుదలకు ఇబ్బందిగా పరిణమించేలా పరిస్థితి తయారైంది. డీగ్లామర్ రోల్ లో నటించిన రితిక కేరక్టర్ జనాలు గుర్తుంచుకునే రకమైంది. ఆ పాత్రలో చూసిన జనం మళ్లీ గ్లామర్ రోల్స్ లో అలాంటి హీరోయిన్లను చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. ప్రస్థుతం లారెన్స్‌ హీరోగా రూపొందిన శివలింగ చిత్రంలో రితిక మిగతా హీరోయిన్స్ లాగానే కమర్షియల్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసింది. స్లమ్‌ గాళ్‌గా అదరగొట్టిన రితిక గ్లామర్‌ క్యారెక్టర్‌లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 

ఎందుకంటే గురు సినిమాలో రితిక చేసిన కేరక్టర్ ఆమెకు ఇచ్చిన ఇమేజ్ అలాంటిది. అయితే హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఆ తరహా పాత్రలకి మాత్రమే పరిమితం అయితే కుదరదు కనుక రితిక ఇప్పుడీ చిత్రంతో తన సత్తా చాటి... తాను కూడా గ్లామర్ రోల్స్ తో మెప్పించగలనని, రెగ్యులర్‌ కమర్షియల్ హీరోయిన్లకు తానేమీ తీసిపోనని నిరూపించుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..