మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. మహేష్23 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

Published : Apr 10, 2017, 12:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. మహేష్23 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

సారాంశం

సస్పెన్స్ కు తెరదించిన మహేష్ మురుగదాస్ టీమ్ ఏప్రిల్ 12న మహేష్ 23 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటన శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్-మురుగదాస్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన సస్పెన్స్ కు తెర పడింది. ఇన్నాళ్లుగా సూపర్ స్టార్ అభిమానులే కాక తెలుగు సినీ ప్రేక్షకులంతా మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించిన సమాచారం కోసం తహతహలాడారు. కానీ ప్రస్తుతం మహేశ్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చాలా కాలం వెయిట్ చేయించారు.

 

కనీసం టైటిల్ కూడా కన్ఫమ్ చేయకుండా అభిమానులను తెగ వెయిట్ చేయించారు. ఈ సినిమాకు వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ బాగా ప్ర‌చారంలో ఉన్నాయి. మధ్యలో 'ఏజెంట్ శివ' అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. 'ఏజెంట్ శివ' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. చివరకు ఇక సంభవామి టైటిల్ ఫైనల్ అని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిలో ఏదీ కన్ఫమ్ కాదని తెలుస్తోంది. మహేష్23 అని పిలుస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మాత్రం బుధవారం ఏప్రిల్ 12 సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేస్తామని ప్రముఖ తెలుగు సినీ విశ్లేషకులు బీ.ఏ.రాజు ట్వీట్ చేశారు.

 

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జూన్ 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.కాగా ఈ సినిమాకి సంబంధించిన సస్పెన్స్ ఇక రెండు రోజుల్లో తొలగిపోనుంది. మహేష్ – మురుగదాస్ ల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 12న విడుదల చేయనున్నారు. దీనిపై తాజా సమాచారం అందించిన మహేష్ మూవీ టీమ్ మహేష్ బాబు 23వ చిత్రంగా, మురుగదాస్ 11వ సినిమాగా రానున్న మూవీ ఫస్ట్ లుక్ 12న విడుదల అని సమాచారమిచ్చింది. ఇక మహేష్23 మూవీ ఫస్ట్ లుక్ 12న.. అంటూ పీఆర్వో వంశీ శేఖర్ ట్విటర్ ఎకౌంట్ లోనూ పోస్ట్ చేశారు.

 

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కూడా... అభిమానులనుద్దేశించి త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుందని, సినిమా కోసం పగలు రాత్రి కష్ట పడుతున్నామని ట్వీట్ చేశారు. సో సూపర్ స్టార్ అభిమానులకు ఇక పండగ రోజులు మొదలవుతున్నాయన్నమాట.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?