Guppedantha Manasu: వసుధారని ఎవరిని పెళ్లి చేసుకున్నావ్ అంటూ నిలదీసిన రిషి.. సంతోషంలో జగతి, మహేంద్ర?

Published : Feb 10, 2023, 07:28 AM ISTUpdated : Feb 10, 2023, 07:33 AM IST
Guppedantha Manasu: వసుధారని ఎవరిని పెళ్లి చేసుకున్నావ్ అంటూ నిలదీసిన రిషి.. సంతోషంలో జగతి, మహేంద్ర?

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో మినిస్టర్ వసుధార ని తన హస్బెండ్ ని ఒకరోజు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలవగా ఇప్పుడు వసుధార రిషి సార్ ని కూడా పిలుచుకుని వస్తాము సార్ అని అంటుంది. మరి మీ ఆయనకు రిషి సార్ ని పరిచయం చేసావా అనగా లేదు సర్ ఆ రోజు తొందరలోనే వస్తుంది అనగా అప్పుడు మినిస్టర్ మీ ఆయనను కూడా మీ కాలేజీలో పెట్టించమ్మా అని అంటాడు. అప్పుడు వసుధార సార్ ఈ ఆలోచన చాలా బాగుంది అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు మినిస్టర్ నీలాంటి మంచి అమ్మాయిని చేసుకున్న అబ్బాయి ఎవరో చూడాలని ఉంది అనడంతో ఇంచుమించుగా రిషి సార్ కూడా ఇలాగే అన్నారు సార్ అంటుంది వసుధార.

 అప్పుడు రిషి మనసులో అమ్మ పొగరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావే అనుకుంటూ మనం వెళ్దాం పద వసుధారా అని అంటాడు. అప్పుడు వసుధార ఒకసారి ఈ చీర పట్టుకోండి సార్ నేను బ్యాగు తీసుకుంటాను అనడంతో రిషి ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు జగతి మహేంద్ర రిషి, వసుధార లు ఫోన్ చేయలేదు అని అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర నేను రిషి కి ఫోన్ చేద్దాము అనగా వద్దు నువ్వు రిషి కి ఫోన్ చేసి ఏవేవో మాట్లాడి టెన్షన్ పెడతావు అనగా ఏం చేద్దాం మరి జగతి అనడంతో వెయిట్ చేద్దాం అని అంటుంది.

మరోవైపు వసుధార రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు వసుధార మినిస్టర్ ఇచ్చిన చీరను వేసుకొని ఫోటోలు దిగుతూ ఉంటుంది. అప్పుడు రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు వసుధార రిషితో కలిసి సెల్ఫీలు దిగుతుంది. సెల్ఫీలు దిగుతూ సార్ ఒక్కసారి నవ్వండి అనగా రిషి కోపంతో కారు ఒకచోట ఆపి కారు దిగుతాడు. అప్పుడు రిషి కోపంతో ఏమనుకుంటున్నావు నువ్వు ఏమి తెలియనట్టుగా నటించకు వసుధార నీ మెడలో ఆ తాళి నీ ఇష్టపూర్వకంగానే పడింది కదా అనగా అవును సార్ అని అంటుంది వసు. అప్పుడు పబ్లిక్ లో ఎవరు అతను ఎవరిని పెళ్లి చేసుకున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటాడు. మన బంధం ఏమైంది మాటలు ఏమయ్యాయి.

రిషి సార్ లేకపోతే బతకను అన్నావు నీ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ మారిపోయావు అని వసుధార మీద సీరియస్ అవుతాడు రిషి. అప్పుడు వసుధార మీద ఫుల్ గా సీరియస్ అవుతాడు రిషి. మీ ఇంటికి వస్తే వెళ్ళిపోమని చెప్పావు. పోలీస్ స్టేషన్ కి వస్తే తాళి ఉంది. అసలు ఏం జరుగుతోంది వసుధార అని నిలదీస్తాడు రిషి. అప్పుడు రిషి మాటలకు వసుధార మౌనంగా ఉంటుంది. అప్పుడు ఏంటి సార్ ఊరుకునే కొద్ది అంతలా గట్టిగా అరుస్తున్నారు అని అనడంతో నిజం అడుగుతున్నాను వసుధార చెప్పు అని ఎవడు వాడు అనడంతో మర్యాదగా మాట్లాడండి సార్. నాకు తాళి కట్టిన వ్యక్తి గురించి అమర్యాదగా  మాట్లాడితే బాగుండదు సర్ అని అంటుంది.

రిషి, వసుధార మీద కోపంతో అరుస్తూ నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వచ్చావు అలాగే ఉండాల్సిన దానివి ఎందుకు నా లైఫ్ ని చెడగొట్టావు అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పి తీరాలి వసుధార అని గట్టిగా అరవడంతో నేను చెప్పను సార్ అని అంటుంది. నేను అసలు చెప్పను సార్ మీ అంతట మీరే తెలుసుకోండి అని రిషిని కోపగించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు జరిగిన విషయాలు తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర,జగతి వసుధార,రిషి ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రతికి మినిస్టర్ ఫోన్ చేసి ఇప్పుడే వసుధార, రిషి లు వచ్చి వెళ్లారు మేడం వాళ్ళు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అనడంతో జగతి మహేంద్ర సంతోషపడుతూ ఉంటారు.

ఆ తర్వాత జగతి వసుధారకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు వసుధార కాస్త వెటకారంగా మాట్లాడడంతో జగతి వాళ్ళు అర్థం కాకుండా నవ్వుతూ ఉంటారు. అప్పుడు జగతి వాళ్ళు అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతూ ఉండగా జగతి దంపతులు నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు రిషి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నేనేం అసలు తప్పు మాట్లాడాను ఎందుకు అలా సీరియస్ అయ్యింది అనుకుంటూ ఉంటాడు. నేను తెలుసుకోలేనా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు రిషి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?