
అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు దిల్ ఖుష్ అయ్యేలా .. అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రెండో ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగానే బాలయ్య తన ఎనర్జీ లెవల్స్ తో పవన్ కు పోటీ ఇస్తూ.. ఎపిసోడ్ ను అద్భుతంగా హోస్ట్ చేశారు. దానితో పాటు సరదా సరదా సంబాషణలు.. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు.. పవర్ స్టార్ గురించి కొత్త కొత్త విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఈసందర్భంగా పవర్ స్టార్ చేసిన ఓ మంచి పనికి బాలయ్య అభినందించకుండా ఉండలేక పోయారు. వెంటనే లేచి హగ్ చేసుకుని మరీ పవర్ ను అభినందించారు.
సినిమాలు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈక్రమంలో ఆయన ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవర్ స్టార్ సొంత డబ్బుతో ఆదుకోవడం అందరిని కదిలించింది. ఈ విషయాన్ని షోలో ప్రస్తావించారు బాలయ్య బాబు. మనకు పట్టెడు అన్నం పెట్టే రైతు.. కష్టాలతో చనిపోతే.. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం..నీ జేబులో డబ్బులు తీసి ఇచ్చావు చూడు.. దానికి నిజంగా హాట్సాఫ్ అంటూ బాలయ్య లేచి నించుని అభినందించారు. ఎమోషనల్ గా పవర్ స్టార్ ను హగ్ చేసుకున్నారు. ఈ సీన్ చూసిన అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇద్దరు స్టార్లను చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
ఈక్రమంలో ఓ వృద్ధురాలు కూడా పవర్ స్టార్ గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవరిమీద ఆధారపడలేదని.. ఆయన సాయం చేసినా.. తను కష్టపడ్డ సొమ్ములోనుంచే ఇస్తున్నాడు తప్పించి..ఎవరిదగ్గర చేయి చాచే వ్యాక్తి కాదు అంటూ పవర్ స్టార్ ను హగ్ చేసుకుని అభినందించింది. అంతే కాదు.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన పవర్ స్టార్ దేవుడు.. ఆయన ఎవరినీ ముంచే వ్యాక్తి కాదు అంటూ ఎమోషనల్ అయ్యింది పెద్దావిడ. ఆయన కష్టపడ్డ డబ్బులే జనాలకు ఇచ్చాడంటూ ఛాలెంజ్ చేసి చెప్పింది పెద్దావిడ.
ఇక ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు డైరెక్టర్ క్రిష్. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పర్ఫక్షనిస్ట్ అటూ పొగడ్తలతో ముంచెత్తారు. హిస్టారికల్ మూవీస్ చేయాలి అనుకోవడం ఈజీగానే ఉంటుంది. కాని చేసేప్పుడు మాత్రం అదరిపోతుంది అంటూ చెప్పుకోచ్చారు. అందులోను పవర్ స్టార్ తో చేయడం అంటే.. ఇదేమిటి.. అదేమిటీ అంటూ..ఎక్కడా తప్పు రాకుండా.. ప్రతీది ఓకటికి పదిసార్లు చెక్ చేసుకుంటారంటూ పవర్ స్టార్ గురించి వ్యాఖ్యానించారు క్రిష్. మొత్తానికి పవర్ స్టార్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2.. లో రెండో ఎపిసోడ్ అభిమానులను అలరిస్తోంది.