ఆనందయ్య మందుపై మళ్లీ వర్మ వరస ట్వీట్లు

By Surya PrakashFirst Published May 25, 2021, 9:32 AM IST
Highlights

'కరోనా అందరిని చంపేస్తే.. ఆనందయ్య మాత్రం అల్లోపతి మందులను చంపేశారు' అంటూ వర్మ ట్వీట్ చేశారు.ఇక మరో ట్వీట్ లో 'ఆనందయ్య కరోనా మందును అందరికీ ఇస్తే చాలని.. ఇక జనాలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని వర్మ సెటైర్ వేశారు.

వివాదాలు ఎక్కడుంటే రామ్ గోపాల్ వర్మ అక్కడుంటారు. ఇప్పుడు ఆయన దృష్టి ఆనందయ్యపై పడింది. కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు గత నాలుగు రోజులుగా అంతటా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మందు  శాస్త్రీయతను నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) టీమ్ సైతం అక్కడికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. పైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్ములాను ఎవరికీ షేర్ చేయలేదు. అలాంటిది, ఆనందయ్య మాత్రం ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.’’ అంటూ గిచ్చటం మొదలెట్టిన ఆయన మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు.

'కరోనా అందరిని చంపేస్తే.. ఆనందయ్య మాత్రం అల్లోపతి మందులను చంపేశారు' అంటూ వర్మ ట్వీట్ చేశారు.ఇక మరో ట్వీట్ లో 'ఆనందయ్య కరోనా మందును అందరికీ ఇస్తే చాలని.. ఇక జనాలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని వర్మ సెటైర్ వేశారు.

ఇక కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఫైజర్ భారత్ బయోటెక్ సీరం అమెరికన్ డాక్టర్ ఫౌచీలను ట్యాగ్ చేసి వర్మ ఎండగట్టారు. ఆనందయ్య వనమూలికలతో తయారు చేసిన కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తుంటే మీరేమో వందల కోట్లతో వ్యాక్సిన్లు తయారు చేసి అంతే రేటుకు అమ్ముతారా? అని వర్మ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అపోలో హాస్పిటల్స్ ఏయిమ్స్ కేర్ సహా అన్ని ఆసుపత్రులను 'ఆనందయ్య ఆస్పత్రులుగా' మార్చాలని.. అన్ని మెడికల్ కాలేజీలు తమ సెలబస్ లో ఆనందయ్య రెసిపీ గురించి చెప్పాలని వర్మ డిమాండ్ చేయడం విశేషం.ఇలా వర్మ ఈరోజు వరుసగా ఆనందయ్య గొప్పతనంపై వర్ణిస్తూ.. కరోనా విషయంలో ఫెయిల్ అయిన వారిని ట్యాగ్ చేస్తూ ఎండగట్టారు.

అలాగే గవర్నమెంట్ ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించలేదా? ఆయనకు ఇంకా మిలటరీ సెక్యూరిటీ కల్పించలేదా? అంటూ ఇప్పటికే ఆనందయ్యపై ఓ రేంజ్‌లో సెటైర్స్ వేసిన వర్మ.. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీల్లో కూడా ఇకపై ఆనందయ్య సిలబస్ పెట్టేస్తున్నారా? అంటూ మరో సెటైరికల్ కామెంట్ వదిలారు. అంతేకాదు ఎయిమ్స్, కేర్ ఆసుపత్రుల పేర్లు ఆనందయ్య ఆసుపత్రులు అని మారుస్తున్నారట కదా!. నేను విన్నది నిజమేనా? అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.

click me!