వకీల్ సాబ్ సూపర్ హిట్ అవటం, విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో సినిమా రెడీ అవుతూండటంతో అభిమానులు ఈ సినిమాపై వచ్చే అప్ డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త ఒకటి బయిటకు వచ్చింది. అదే టీజర్ రిలీజ్ డేట్.
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. అందులోనూ వకీల్ సాబ్ సూపర్ హిట్ అవటం, విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో సినిమా రెడీ అవుతూండటంతో అభిమానులు ఈ సినిమాపై వచ్చే అప్ డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త ఒకటి బయిటకు వచ్చింది. అదే టీజర్ రిలీజ్ డేట్.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించి టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్ 2న విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రటీమ్. అదే విధంగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సంబంధించి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సైతం విడుదల చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘హరిహరి వీరమల్లు’కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది.
మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారు. పూర్తిగా సెట్స్ లోనే నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, ఆ గ్రాఫిక్ వర్క్ కోసమే దాదాపుగా 50 కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. చాలావరకు గ్రీన్ మ్యాట్ లోనే చిత్రీకరణ జరిగిపి వీఎఫెక్స్ లో అన్ని యాడ్ చేస్తారట.
చిత్రానికి ‘ఆక్వామన్’, ‘వార్‌క్రాఫ్ట్’, ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి VFX బాధ్యతలను చూస్తున్నారు. వీఎఫెక్స్ వర్క్ లేట్ అవుతున్నందునే క్రిష్ ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పుతున్నా కష్టమే అంటున్నారు.
సినిమా షూటింగ్ ప్రారంభమై పదిహేను రోజులు షూటింగ్ కూడా జరుపుకొంది. బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నేతృత్యంలో ఆ మధ్య పవన్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అర్జున్ రాంపాల్, జాక్వెలైన్ ఫెర్నాండజ్, ఆదిత్య మేనన్ తదితరులు నటిస్తున్నారు. పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ లో నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ అంటే దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు మేకర్స్.