అతని భుజాలపైకి ఎక్కి చిన్న పిల్లలా స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్న రకుల్!

Published : May 24, 2021, 08:47 PM IST
అతని భుజాలపైకి ఎక్కి చిన్న పిల్లలా స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్న రకుల్!

సారాంశం

నేడు బ్రదర్స్ డే నేపథ్యంలో రకుల్ ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ జలకాలాడుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పాటు హ్యాపీ బ్రదర్స్ విషెస్ తెలియజేశారు.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏకంగా మూడు చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న మేడే మూవీలో రకుల్ నటిస్తున్నారు. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ అటాక్ మూవీలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు అజయ్ దేవ్ గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న థాంక్ గాడ్ అనే చిత్రం ఆమె ఖాతాలో ఉంది. 


టాలీవుడ్ ని వదిలేసి వెళ్లినా కానీ బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కడంతో హ్యాపీగా ఉంది అమ్మడు. తెలుగులో ఆమె నటించిన ఓ మూవీ విడుదల కావాల్సి ఉంది. వైష్ణవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. వీటితో పాటు మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 


కాగా నేడు బ్రదర్స్ డే నేపథ్యంలో రకుల్ ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ జలకాలాడుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పాటు హ్యాపీ బ్రదర్స్ విషెస్ తెలియజేశారు. కాగా అమన్ ప్రీత్ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అమన్ హీరోగా ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. 
 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?