RGV Mothers Day Wishes : నేను మంచి కొడుకును కాను, రామ్ గోపాల్ వర్మ మదర్స్ డే పోస్ట్

Published : May 08, 2022, 09:30 PM ISTUpdated : May 08, 2022, 09:32 PM IST
RGV Mothers Day Wishes : నేను మంచి కొడుకును కాను, రామ్ గోపాల్ వర్మ మదర్స్ డే పోస్ట్

సారాంశం

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం, ఆయన చేసే ప్రతీ పని రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఏ విషయం అయినా సరే ఆర్జీవి కామెంట్ కోసం  ఎదురు చూస్తుంటారు నెటిజన్లు. ఇక తాజాగా ఆయన మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు.    

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం, ఆయన చేసే ప్రతీ పని రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఏ విషయం అయినా సరే ఆర్జీవి కామెంట్ కోసం  ఎదురు చూస్తుంటారు నెటిజన్లు. ఇక తాజాగా ఆయన మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు.  

రామ్ గోపాల్ వర్మ.. అనే పేరే ఒక  సంచలనం. ఆ విషయం  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఎప్పుడు ఏ విషయంలో ఎలా స్పందిస్తారా అనేది అందరికి ఆసక్తిగా ఉంటుంది. కొన్ని విషయాలు వదిలేయవచ్చు..  ఏ విషయాన్నైనా సరే సూటిగా.. వివాదాస్పదంగా చెప్పడం ఆయనకే చెల్లుతుంది.  అందుకే ప్రతీ విషయంలో వర్మ మార్క్ సెపరేట్ గా ఉంటుంది. స్పెషల్ గా ఉంటుంది. 

ఇక ఈరోజు మతృదినోత్సవం సందర్భంగా కూడా ఆయన తన మార్కు చూపించుకున్నారు. మదర్స్ డే సందర్భంగా ఆర్జీవి సోషల్ మీడియాలో ఓ స్పెషల్   ట్వీట్ పెట్టారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి మదర్స్ డే  శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. అయితే ఈ సందర్భంలో కూడా కొన్ని ఇంట్రస్టింగ్  విషయాలు వెల్లడించాడు వర్మ. అసలు తాను మంచి కొడుకును కాదంటూ వ్యాఖ్యానించారు. 

 

సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు వర్మ. హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ  అంటూ రాసుకొచ్చారు ఆర్జీవి. అంతే కాదు దీనికి తోడు  చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.  


మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు మారిపోయారు సర్  అంటూ జోకులేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ పెట్టింది మన ఆర్జీవినేనా..  అంటూ అడుగుతున్నారు. మరో యూజర్ ఓ అడుగు ముందుకేసి  ఎంత పెద్ద ఎదవైనా అమ్మ ముందు పసివాడే  అంటూ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పోస్ట్ పెట్టడం నెటిజన్స్ కు షాక్ ఇస్తోంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?